విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విశాకపట్నం జిల్లా : ఇన్నాళ్లూ రైస్ కొనుక్కోవాలంటే జేబులు తడుముకునే పరిస్థితి. ఇప్పుడు రోజులు మారినట్లే. మనం కేజీ రూ.29కే రైస్ కొనుక్కోవచ్చు. ఎక్కడ కొనుక్కోవచ్చో తెలుసుకుందాం.ఫిబ్రవరి 6 నుంచి భారత్ రైస్, దేశవ్యాప్తంగా అమ్మకం మొదలవుతుంది. ఐతే.. ఈ రైస్ ఇప్పుడే మార్కెట్‌లోని షాపులలో దొరకకపోవచ్చు. మనం దీన్ని ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
భారత ఆహార సంస్థ (FCI) నుంచి భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య (NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) ద్వారా ముందుగా ఈ రైస్‌ని అమ్ముతున్నారు.... ఈ రైస్ మీకు కావాలంటే మీరు నాఫెడ్ అధికారిక వెబ్‌సైట్ https://www.nafedbazaar.com/product-tag/online-shopping లోకి వెళ్లాలి. ఇక్కడ మీకు భారత్ రైస్‌తోపాటూ.. పప్పు, పంచదార, శనగలు ఇలా చాలా ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుక్కోవచ్చు.
[06/02, 07:54] Viswastv.com: భారత్ రైస్‌ని కేజీ రూ.29కి కేంద్రం అమ్ముతోంది. ఈ రైస్ మనకు 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో లభిస్తాయి. ఈ రైస్‌తోపాటూ.. గోధుమపిండిని కేజీ రూ.27.50కి, శనగపప్పును కేజీ రూ.60కి నాఫెడ్‌లో అమ్ముతున్నారు [06/02, 07:54] Viswastv.com: భారత్ రైస్‌ని నాఫెడ్‌తోపాటూ.. ఇతర ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా కొనుక్కోవచ్చు. నాఫెడ్‌లో కొనుక్కోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని, తర్వాత లాగిన్ అయ్యి, మీ అడ్రెస్ ఇచ్చి, కొనుక్కోవచ్చు [06/02, 07:54] Viswastv.com: ఇప్పటివరకూ బియ్యం ధర తక్కువలో తక్కువ కేజీ రూ.50 దాకా ఉంటోంది. నాణ్యమైన సోనా మసూరీ బియ్యం కావాలంటే కేజీ రూ.60 ఉంటోంది. అంత ధరకు కొనుక్కోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అదే నాణ్యత గల బియ్యాన్ని కేంద్రం భారత్ రైస్ పేరుతో కేజీ రూ.29కే అమ్ముతోంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కేంద్రం తెలిపింది. (All Images credit - nafedbazaar.com)
Admin
Viswas Tv