విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం 20 సంవత్సరాల తర్వాత కలిసిన 2004-2005 టెన్త్ క్లాస్ విద్యార్థులు...... అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలం, కాశీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2004 -2005 సంవత్సరం 10వ తరగతి 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనo ఆదివారం కాశీపురం ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు... చిన్ననాటి చదువు చెప్పిన ఉపాధ్యాయులును జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు హెచ్ఎం గా పని చేసిన స్వర్గీయ బాబురావు మాస్టారుకి ముందుగా మౌనం పాటించి, చదువు చెప్పిన ఉపాధ్యాయులును జ్ఞాపకం చేసుకుంటూ, ఆనందంగా గడిపారు... అనంతరం చిన్ననాటి చదువుకున్న మధుర జ్ఞాపకాలను నేమురు వేసుకుంటూ ఆత్మీయంగా, ఆనందంగా ఉల్లాసంగా,గత 20 సంవత్సరాలు క్రితం ఒకే చోట చదువుకున్న మధురు జ్ఞాపకాలను ఒకే చోట కలవడం సంతోషంగా ఉందని జ్ఞాపకాలను అందరూ కలిసి సంతోషం వ్యక్తం చేశారు... ఇకనుండి ప్రతి సంవత్సరం అందరం ఒకే చోట కలుసుకొని, కష్ట, సుఖాలను పాలుపంచుకొని అందరం ఒకే వేదికపై ఉండి,,, ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు 2005వ సంవత్సరం విద్యార్థులు... మన విద్యార్థులులో ఎవరు చనిపోయిన, బాధలో ఉన్నా, స్కూల్ బాగుకోసంతో పాటు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండటమే ఈ ఫౌండేషన్ లక్ష్యం అని విద్యార్థులు అన్నారు... ముఖ్యంగా అనారోగ్యం వచ్చిన, మరణించిన, పేదరికంలో మగ్గిపోయిన వాళ్ల కుటుంబాలకి అండగా ఉండటం కోసమే ""కాశీపురం హై స్కూల్ బాబురావు మాస్టర్ ఫౌండేషన్ ""గా నామకరణం చేశారు.. విద్యార్థులంతా ఈ ఫౌండేషన్ కి పూర్తిగా సహకారం అందించాలని అందరూ కలిసికట్టుగా ముందుకు నడవాలని కొంతమంది విద్యార్థులు నడుము కట్టారు ఈ ఫౌండేషన్ ద్వారా.. విద్యార్థుల్లో ఒకరైన,విద్యార్థి భర్త చనిపోవడంతో ఆ మహిళా విద్యార్థికి ₹10,000 ఆర్థిక సహాయం చేసినట్టు విద్యార్థులు తెలిపారు.... వచ్చే మూడు, నాలుగు నెలల్లోనే ఫౌండేషన్ ద్వారా, విద్యార్థులు మరియు ఫ్యామిలీ మొత్తం వచ్చి మరో మీటింగ్ పెట్టి అందరం కలిసి కంకణం కట్టుకోవాలి అని పూర్వ విద్యార్థులు అన్నారు..20 వసంతాలు, పూర్తయిన సందర్భంగా గట్టి నిర్ణయం తీసుకున్నారని 1997లో ఉన్న హెచ్ఎం నాయుడు మాస్టర్ కొనియాడారు
బాబురావు మాస్టర్ గారికి 2నిముషాలు మౌనo పాటిoచిన పూర్వ విద్యార్థులు
Admin
Viswas Tv