విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : gold బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని ఒక లక్ష రూపాయల నుంచి నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం 97 వేల రూపాయల సమీపానికి చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 89 వేల సమీపానికి చేరుకుంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే గ్లోబల్ మార్కెట్లో అమెరికా ఫ్యూచర్స్ గోల్డ్ ధరలు ఒక ఔన్స్ కు 3317 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. గతంతో పోల్చి చూస్తే ఇది దాదాపు 0.9 శాతం తగ్గినట్లు చెప్పవచ్చు. ఒక ఔన్స్ అంటే 31.2 గ్రాములు ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం అమెరికాలో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 92,000 సమీపంలో ఉంది. బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అమెరికా ఇటీవల విడుదల చేసిన జాబ్స్ డేటా కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే మే నెల విడుదల చేసిన జాబ్స్ డేటాలో దాదాపు 1,39,000 ఉద్యోగాలు కొత్తగా నియామకాలు జరిగాయని ఈ డేటాలో విడుదల చేశారు. అంతేకాదు నిరుద్యోగం కూడా కేవలం 4.2 వద్దనే స్థిరంగా ఉందని పేర్కొన్నారు. అలాగే వేతనాలు కూడా పెరిగినట్లు సూచన చేశారు. దీంతోపాటు అక్టోబర్ నెలలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని కూడా పేర్కొన్నారు. ఈ సానుకూల అంశాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లో పాజిటివ్ గా స్పందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన చూసినట్లయితే, బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి భారీగా తగ్గే అవకాశం ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణం స్టాక్ మార్కెట్లు పాజిటివ్ సిగ్నల్స్ చూపించడం ఒక కారణంగా చెప్పవచ్చు. స్టాక్ మార్కెట్లో లాభాల బాటలో ఉన్నట్లయితే బంగారం ధరలు తగ్గుతాయి అని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ఉన్నప్పుడు సాధారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సేఫ్ అని భావించే బంగారంలో పెట్టుబడి పెడుతుంటారు. ఒకవేళ స్టాక్ మార్కెట్లో మళ్లీ లాభాల్లోకి వచ్చినప్పుడు బంగారం నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడుతుంటారు. ఇది సర్వసాధారణమైన విషయం అని చెప్పవచ్చు. ఈ కారణంగా కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి అని చెప్పవచ్చు. దీనికి తోడు బలమైన డాలర్ ట్రేడింగ్ కారణంగా కూడా డాలర్ బలపడి బంగారం ధరలు తగ్గుతున్నాయి. డాలర్ బలపడినప్పుడల్లా బంగారం ధర భారీగా తగ్గుతుంది.
Admin
Viswas Tv