Wednesday, 19 November 2025 07:05:25 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

కోడిలితో మామ చేసిన ''ఆ''పనికి పాపం ఆలా జరుగుతుంది అని అనుకోలేదు

Date : 26 May 2024 10:00 PM Views : 1425

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / అమరావతి : అమరావతి :అతడు ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నాడు. దేశకోసం ప్రాణాలు అర్పించే ఆర్మీ జవాన్ . సరిహద్దుల్లో పహారా కాసే అతడికి అందమైన ఫ్యామిలీ కూడా ఉంది. కానీ ఏం లాభం.. అతడిది వక్రమైన బుద్ది. సమీప బంధువుపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకున్నాడు. చివరకు పెళ్లి చేసుకోమనే సరికి ఆమె అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆ యువతిని మట్టుబెట్టి.. సాక్ష్యాలు లేకుండా చేశాడు. ఇందుకు సహకరించింది జవాన్ భార్య కూడా. ఆ తర్వాత ఏం ఎరగన్నట్లు విధులకు వెళ్లిపోయాడు.. అయితే స్థానికులకు అర్థనగ్నంగా పొలంలో రక్తంతో తడిసి ఉన్న ఓ అమ్మాయి మృతదేహం కనిపించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితుడ్ని అరెస్టు చేశారు. చివరకు నిందితుడు బాధితురాలికి మామయ్య అవుతాడని తెలిసి అవాక్కయ్యారు. మేన కోడలు వరుసయ్యే అమ్మాయిని వంచించి, నమ్మకద్రోహం చేసి హత్య చేశాడు ఆమె మామ. కుటుంబ బాంధవ్యాలను భయపట్టేలా ఉన్న ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పింటూ సింగ్ రాజ్ పుత్.. ఆర్మీలో లాన్స్ నాయక్‍గా పనిచేస్తున్నాడు. ఉజ్జయిని నివాసి అయిన భరత్ సింగ్ రాథోడ్ కుమార్తె సవితా రాథోడ్ ఆమెకు మామ వరుస అవుతాడు. అమ్మాయి.. రత్లాంలోని సఖ్వాల్ నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ నర్సింగ్ కోచ్ చేస్తోంది. ఈ క్రమంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య శారీరక సంబంధం మొదలైంది. అయితే సవితా తరచుగా తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుంది. అప్పటికే పెళ్లైన పింటూ.. దాట వేసుకుంటూ వస్తున్నాడు. ఇటీవల జమ్ము కాశ్మీర్ నుండి సెలవులపై ఇంటికి వచ్చిన పింటూ ఈ విషయంపై తేల్చుకుని విధుల్లో చేరాలని అనుకున్నాడు. ఏప్రిల్ 1వ తేదీన సాయంత్రం సవితను కలవాలని ఫోన్ చేశాడు. ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి రత్లామ్‌లోని మోవ్-నీముచ్ హైవే నాలుగు లేన్‌లో సమీపంలోని మైదానంలోకి వెళ్లారు. తన వెంట తెచ్చుకున్న కత్తితో సవిత ఛాతిపై దాడి చేశాడు. అనంతరం కత్తితో గొంతు కోశాడు. దీంతో అక్కడిక్కడే ప్రియురాలు అతడి కళ్లముందే గిలగిలా కొట్టుకుని చనిపోయింది. మృతదేహాన్ని అక్కడే ఉన్న పొదల్లో పడేసి.. స్వగ్రామానికి వెళ్లాడు.ఇంటికి వెళ్లి తన భార్య శీతల్‌కు జరిగిందంతా చెప్పాడు. అనంతరం భార్య కూడా సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నం చేసింది. దృశ్యం సినిమా తరహాలో ఆ గ్రామంలో హత్య జరిగిన రోజు తాము లేమని చెప్పేందుకు భార్యను ఆమె పుట్టింట్లో వదిలి.. అదే రోజు రాత్రి పింటూ ఢిల్లీ నుండి విమానంలో జమ్ము కాశ్మీర్ చేరుకుని డ్యూటీలో చేరాడు. అమ్మాయి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా నిందితుడ్ని గుర్తించారు. కాగా, నిందితుడు పింటూను అరెస్టు చేశారు. అలాగే భర్తకు సహకరించిన భార్యను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు .పోలీస్ అధికారులు చెప్పారు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :