Wednesday, 19 November 2025 07:07:32 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ !

Date : 17 September 2025 10:41 PM Views : 162

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : *రాజకీయాలకు వల్లభనేని గుడ్ బై..?* గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. 2024 లో ఓడిపోయిన తర్వాత వల్లభనేని వంశీ వ్యక్తిగతంగా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా.. ఆయనపై పలు కేసులు నమోదు కావడం, మరికొన్ని కేసులు ఆయన ఇబ్బంది పెట్టేందుకు సిద్ధంగా ఉండటంతో వంశీ ఇక రాజకీయాలకు దూరం కావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంశీ ఓడిపోయిన తర్వాత నియోజకవర్గంలో పెద్దగా పర్యటించలేదు. ఆ తర్వాత కేసులు కారణంగా జైల్లో ఉన్నారు. ఇక ఇప్పుడు ఆయన భార్య పంకజ శ్రీని, నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించాలని, వైసీపీ అధినేత వైయస్ జగన్(Ys jagan) నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వంశీ రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు సుముఖంగా లేరని, అనారోగ్య సమస్యలు సైతం ఆయనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని సన్నిహితులు అంటున్నారు. అటు గన్నవరం నాయకులు నుంచి కూడా వంశీకి పెద్దగా సహకారం లేదని సమాచారం. జైలు నుంచి విడుదలైన తర్వాత, వంశీ గన్నవరం సమీపంలోనే ఉంటున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన 35 కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదు. దీనితో గన్నవరం సమీపంలోని సన్నిహితులు ఇళ్లల్లో వంశీ ఉంటున్నట్లు తెలిసింది. ఆ సమయంలో కూడా గన్నవరం వైసీపీ నాయకులు ఎవరు ఆయన వద్దకు వెళ్లి, పరామర్శించిన పరిస్థితి లేదు. దానికి తోడు కార్యకర్తలు కూడా పెద్దగా వంశీ కోసం ముందుకు రావడం లేదు. గతంలో ఆయన కోసం తిరిగిన వాళ్లు కూడా ఇప్పుడు దూరం కావడం, వంశీని మరింత ఇబ్బంది పెడుతోంది. ఇక మరికొన్ని కబ్జా కేసులు కూడా బయటకు తీసే పనిలో పోలీసులు పడ్డారు. అటు రెవిన్యూ శాఖ కూడా కొన్ని అక్రమాలపై దృష్టి సారించింది. ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో ముందుకు వెళ్లడం కష్టమని భావిస్తున్న వంశీ, ఇక త్వరలోనే.. తన నిర్ణయాన్ని పార్టీ అధినేతకు చెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక నియోజకవర్గంలో వైసీపీకి వంశీ మినహా మరో ఆప్షన్ కూడా పెద్దగా కనపడటం లేదనే చెప్పాలి. మరి దీనిపై జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :