విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విజయనగరం జిల్లా : ఏపీకి మరో వైద్య కళాశాల మంజూరైంది. విజయనగరంలో మెడికల్ కాలేజీకి జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. 150 సీట్లతో ఈ వైద్య కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసీ సమ్మతించింది. విజయనగరం వైద్య కళాశాలలో 2023-24 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని ఎన్ఎంసీ వెల్లడించింది. త్వరలోనే మరో 4 వైద్య కళాశాలలకు అనుమతి వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ ఏడాదే నాలుగు కళాశాలలు ప్రారంభమయ్యేలా చర్యలు ఉంటాయని వివరించింది.
Admin
Viswas Tv