విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖ జిల్లాలో డ్రగ్ అధికారులు ఘాటు వ్యాకులు తో కూడిన ప్రసంగాలు, జరుగుతున్న పరిణామాలు, నార్కోట్రిక్స్ డ్రగ్స్, జాతీయ ఆన్లైన్ సిస్టం పై, అధిక మోతాదులో యాంటీబయటిక్ అమ్మకాలు వీటన్నింటిపై అవగాహన వుడా చిల్డ్రన్ థియేటర్ విశాఖపట్నం నందు జరిగిన కార్యక్రమానికి అధిక మోతాదులో ఫార్మసిస్టులు, అధికారి యంత్రాంగం పాల్గొనటం జరిగింది...... డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) డైరెక్టర్ జనరల్ ఆదేశాల మేరకు, విశాఖపట్నం జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ (VDDTA) మరియు స్మార్ట్ విశాఖ కెమిస్ట్ వెల్ఫేర్ సొసైటీ (SVCWS) సమన్వయంతో, 2025 సెప్టెంబర్ 12న విశాఖపట్నం, సిరిపురం, వీఎంఆర్‌డిఏ చిల్డ్రన్స్ అరేనాలో ఆంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR) మరియు నార్కోటిక్/సైకోట్రోపిక్ (NRx) డ్రగ్స్ దుర్వినియోగం పై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. శ్రీ ఎస్. విజయ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్, విశాఖపట్నం, కెమిస్టులకు జిల్లా వ్యాప్తంగా సడెన్ చెక్సులు జరుగుతున్నాయని, అన్ని కెమిస్టులు మరియు డ్రగ్గిస్టులు నిరంతర నియంత్రణ పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. NRx డ్రగ్స్ మరియు ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీమతి ఎస్. స్వర్ణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్, గీతం, AMR మరియు యాంటీబయాటిక్స్ సమంజసమైన వినియోగం పై గెస్ట్ లెక్చర్ ఇచ్చారు. కార్యక్రమంలో భాగంగా, ఆన్‌లైన్ నేషనల్ డ్రగ్స్ లైసెన్సింగ్ సిస్టమ్ (ONDLS) పై సాంకేతిక సమావేశాన్ని డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఎం. శ్రీనివాస్ రావు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్ సేల్స్ లైసెన్సింగ్ సిస్టమ్ లో దరఖాస్తులు మరియు అనుమతులపై అవగాహన కల్పించారు. డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు శ్రీమతి వి. అభిప్రియా (మాన్యుఫాక్చరింగ్), శ్రీమతి కున కల్యాణి (విజిలెన్స్), శ్రీమతి ఇందిరా భారతీ (అనకాపల్లి), మరియు శ్రీమతి ఎన్. కల్యాణి (నర్సీపట్నం) పాల్గొని, ఫార్మసిస్టుల పాత్రలు మరియు బాధ్యతలు, రిజిస్టర్లు మరియు రికార్డుల నిర్వహణ వంటి పలు అంశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుమారు 650 మంది సభ్యులు, ఫార్మసిస్టులు మరియు కెమిస్టులు పాల్గొన్నారు.
Also Read : మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష
Admin
Viswas Tv