Saturday, 13 June 2026 10:06:09 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు**తేల్చేసిన జాతీయ సర్వే

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు - తేల్చేసిన జాతీయ సర్వే.. ఇండియా టూడే - సీ సర్వే సర్వే లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే మోదీ మరోసారి ప్రధా

Date : 27 January 2023 11:26 PM Views : 958

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విజయవాడ : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు - తేల్చేసిన జాతీయ సర్వే.. ఇండియా టూడే - సీ సర్వే సర్వే లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే మోదీ మరోసారి ప్రధాని అవుతారని తేలింది. తెలుగు రాష్ట్రాల్లో హోరా హోరీ పోరు కనిపిస్తోంది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలిచేదెవరు. రాజకీయంగా ఇప్పుడు ఆసక్తి పెంచుతున్న అంశం ఇది. ఇదే అంశం పైన ఇండియా టుడే-సీవోటర్స్‌ 'మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌' సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తి కర అంశాలు బయటకు వచ్చాయి. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ గెలిచేది ఎన్డీయే కూటమేననీ సర్వే తేల్చింది. ఎన్డీయేకు 284 సీట్లు - ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. గతం కంటే ఎన్డీఏకు తగ్గగా..యూపీఏకు పెరిగాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో హోరా హోరీ పోరు పైన ఆసక్తి కర అంశాలను వెల్లడించింది.ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠంపై..! ఇండియా టుడే-సీవోటర్స్‌ 'మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌' సర్వే లో ప్రధానంగా ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశం పైన పబ్లిక్ మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేసారు. ఈ సర్వేలో ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని తేలింది. బీజేపీ 284 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని, కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. ప్రధాని మోడీ పాపులారిటీ చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతోందని సర్వేలో తేలింది. ప్రధాని మోడీ పనితీరు పట్ల తాజాగా 72% మంది సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడైంది. ఎన్డీఏ ప్రభుత్వం పట్ల 2022 ఆగస్ట్ లో 56 శాతం మందే సంతృప్తి వ్యక్తంచేయగా.. తాజాగా గవర్నమెంట్ అప్రూవల్ రేటింగ్ 11 శాతం పెరిగింది.ఇది అంతా దొంగ సర్వే అని, మోదీ ఆడుతున్న నాటకాలు అని ప్రతిపక్షాలు ఎద్దవా చేసాయి... మైండ్ గేమ్ ఆడుతున్నారు గుజరాత్ బాబాలు అని అంటున్నారు... కాంగ్రెస్ 68 సీట్లకు పరిమితం అవుతుందని, ఇతరులకు 191 సీట్లు వస్తాయని సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీని నడిపే నేత ఎవరనే ప్రశ్నకు రాహుల్ గాంధీకి 26శాతం మంది ఓటెయ్యగా.. మరో 17శాతం సచిన్ పైలట్ కు మొగ్గు చూపారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లు కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలు..ఫెయిల్యూర్స్ పైన తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. అందులో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన విజయాల్లో కొవిడ్ మేనేజ్మెంట్ అని 20%, మంది మద్దతుగా నిలవగా.. ఆర్టికల్ 370 రద్దు అని 14% శాతం మంది పేర్కొన్నారు, అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం అని 12% మంది చెప్పారు. మోడీ సర్కార్ అతిపెద్ద వైఫల్యాల గురించి ప్రశ్నించగా.. ధరల పెరుగుదల అని 25%, నిరుద్యోగం అని 17%, కరోనా మేనేజ్మెంట్ అని 8% ఓటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రతిపక్ష నేతగా కేజ్రీవాల్ కి 24శాతం మంది, మమతా బెనర్జీకి 20 శాతం మంది మద్దతు ప్రకటించారు. మోదీకి ధీటుగా రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా 13 శాతం మద్దతు లభించినట్లు సర్వేలో వెల్లడైంది

తెలుగు రాష్ట్రాల్లో హోరా హోరీ.. తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వేకు సంబంధించి ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. గత ఎన్నికల్లో ఏపీలో టీడీపీ 3, వైసీపీ 22 స్థానాలు గెలుచుకోగా.. ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఆసక్తి కర పోరు కొనసాగనుంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా.. పొత్తుతో ముందుకు వెళ్తుందా అనే దానికి అనుగుణంగా సీట్ల సంఖ్య మారే అవకాశం ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ మెజార్టీ సీట్లు సాధించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అయ్యాయి. బీజేపీ గతంలో నాలుగు సీట్లు పొందగా.. ఇప్పుడు కొంత మేర పుంజుకున్నట్లు స్పష్టం అవుతోంది. జాతీయ స్థాయిలో బీజేపీకి ఆదరణ పెరగ్గా..తెలంగాణలోనూ ఆ ప్రభావం కొంత మేర కనిపిస్తోంది. కానీ, ఏపీలో మాత్రం ప్రాంతీయ పార్టీల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :