విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : అమరావతి : *ఏపీ అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం..!* ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు... ప్రజలు కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది... గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది... గత ప్రభుత్వం తీరుకు ఓటుతో ప్రజలు గుణపాఠం చెప్పారు... అన్ని అంశాలల్లోనూ గత ప్రభుత్వం విఫలమైంది... ఆర్థికంగా రాష్ట్రాన్ని ఎంతో దెబ్బతీశారు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశాం... వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఎంతో నష్టపోయింది... సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం... అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం... అన్నక్యాంటీన్లు తెచ్చి పేదల ఆకలి తీరుస్తున్నాం... కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం... మా ప్రభుత్వంలో తలసరి ఆదాయం పెరిగింది... అవకాశాలిస్తే ప్రతిఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని నమ్ముతున్నాం... ఏపీ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం... ప్రతినెల ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నాం... పెన్షన్లు రూ.4వేలకు పెంచాం... పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, విద్య, వైద్యం మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం... బీసీ వర్గాల ఉన్నతి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాం... స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు ఇస్తున్నాం... ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం... పోలవరం ప్రాజెక్టును పట్టాలెక్కించాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయేలా చేశాం... అర్హులైన పేదలందరికీ సొంతిల్లు ఉండాలనేది మా ఆకాంక్ష... ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీరు, విద్యుత్ అందిస్తున్నాం... ఐటీ నుంచి ఏఐ రివల్యూషన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది... సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం... 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం... పేదరికం నిర్మూనలకు వినూత్న విధానంతో ముందుకెళుతున్నాం... ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పీ4 నినాదాన్ని అనుసరిస్తున్నాం... విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాం... ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి... స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాం... తల్లికి వందనం పథకాన్ని తీసుకువస్తున్నాం... తల్లి దండ్రులకు పిల్లల చదువులు భారం కాకుండా తల్లికి వందనం... తొలిసారిగా స్కిల్ సెన్సెన్స్ నిర్వహిస్తున్నాం... ప్రతి ఇంటికి ఓ వ్యాపారవేత్త ఉండాలనేది మా లక్ష్యం... విస్తృత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం... దేశంలోనే ఐటీలో ఏపీని టాప్‌లో నిలిపేలా కొత్త ఐటీ పాలసీ... ఉద్యోగాలు, నైపుణ్య హబ్‌గా ఏపీని మార్చేలా ప్రయత్నం... గత ఐదేళ్లలో ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు... ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పోలవరంతో లింక్ చేస్తున్నాం... 2027 నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం... బనకచర్ల ప్రాజెక్టుతో రాయలసీమకు ప్రయోజనం... హంద్రీనీవా సుజల స్రవంతి పనులు వేగంగా సాగుతున్నాయి... వెలిగొండ ప్రాజెక్టు 75 శాతం పూర్తైంది... ఏ రైతుకు సాగునీటి ఇబ్బందులు ఉండకూడదు... ఎకరం భూమి కూడా నిరుపయోగంగా ఉండకూడదు... వ్యవసాయం రైతులకు మరింత లాభదాయకండా మారేలా చర్యలు... భూగర్భ జలాలను పెంచేలా చర్యలు తీసుకున్నాం... 4,300 కిలోమీటర్ల సీసీ రోడ్లను మంజూరు చేశాం... గుంతలులేని రోడ్ల నిర్మాణంలో అద్భుతమైన పురోగతి... 20,059 కి.మీ.కి గాను 3 నెలల్లోనే 27,605 కి.మీ. రోడ్ల పని పూర్తి చేశాం... 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించే లక్ష్యం... రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగాల సృష్టిపై ఫోకస్... 2025-26లో విద్యుత్ ఛార్జీల పెరుగుదల ఉండదు... 20 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు... రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందించేలా వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ : గవర్నర్ అబ్దుల్ నజీర్
Admin
Viswas Tv