Wednesday, 29 July 2026 06:44:51 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

అర్ధరాత్రి పూజలు, గురువు గారుది, రక్తాన్ని త్రాగిన శిష్యడు.....

Date : 04 February 2023 11:43 AM Views : 1053

విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విశాకపట్నం జిల్లా : ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తరీ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. క్షుద్రపూజలు చేసే వ్యక్తిని అతడి శిష్యుడే దారుణంగా చంపి రక్తం తాగాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసంత్‌ సాహు (50) అనే వ్యక్తి దగ్గర నిందితుడు రౌనక్‌ సింగ్‌ ఛబ్రా అలియాస్‌ మన్య (25) క్షుద్రపూజలు నేర్చుకుంటున్నాడు. అయితే, శిష్యుడు తంత్ర-మంత్ర విద్యలో ప్రావీణ్యం పొందాలనుకున్నాడు. బసంత్‌ను చంపి అతడి రక్తం తాగితే తనకు క్షుద్రపూజలు చేసే శక్తులు తనకూ వస్తాయని భావించాడు. బసంత్‌ క్షుద్రపూజలు చేస్తుండగా దాడి చేశాడు. శిష్యుడు మొదట తన గురువు తలపై కర్రతో కొట్టాడు. ఆ తర్వాత గురువు రక్తం బయటకు రాగానే.. రక్తం తాగడం ప్రారంభించాడు. ఆ తర్వాత గురువు గారి ప్రైవేట్‌ భాగంలో కర్ర పెట్టి సజీవ దహనం చేశాడు. పాక్షికంగా కాలిన మృతదేహాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుణ్ని అరెస్టు చేసినట్లు ధామ్‌తరీ పోలీసులు తెలిపారు.

ప్యారీ సోడూర్ నది ఒడ్డున శంసన్ ఘాట్ సమీపంలో సగం కాలిన మృతదేహం పడి ఉందని ధామ్‌తరి పోలీసులకు ఇన్‌ఫార్మర్ నుంచి సమాచారం అందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తన తండ్రి జనవరి రాత్రి 8 గంటల సమయంలో రౌనక్‌సింగ్‌ ఛబ్రా అనే వ్యక్తితో కలిసి మోటార్‌సైకిల్‌పై వెళ్లాడని సోమవారం మార్కెట్‌ నయాపారా పోలీస్‌ స్టేషన్‌లో దేవేంద్ర సాహు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రౌనక్ సింగ్ ఛబ్రాను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. తంత్ర సాధన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చంపి, అతని రక్తాన్ని తాగితే, తంత్ర సాధక్‌కు ఆ శక్తులన్నీ లభిస్తాయని నిందితుడు రౌనక్ సింగ్ ఛబ్రాతో ఒక సాధు చెప్పడంతో అలా చేసినట్లు వెల్లడించాడు.

మృతుడు బసంత్ సాహు.. నిందితుడు రౌనక్ జనవరి 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరూ తంత్ర సాధన కోసం శ్మశాన వాటిక చేరుకుని పూజలు చేశారు. పూజలు చేస్తున్న సమయంలో రౌనక్ సింగ్ అలియాస్ మాన్య చావ్లా, తన గురువు బసంత్ సాహును అతని తలపై కర్రతో కొట్టి, రక్తాన్ని తాగాడని పోలీసులు తెలిపారు. బసంత్ జననాంగాలలో కర్ర పెట్టి కాల్చాడనన్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: