విశ్వాస్ టీవీ - ఢిల్లీ / విజయవాడ : Formear PM Manmohan Singh Passed Away :మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది.పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎయిమ్స్‌కు చేరుకున్నారు.'పార్టీలకు అతీతంగా అభిమానం పొందారు' "మాజీ ప్రధాన మంత్రి, ఆర్థికవేత్త శ్రీ మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు. దూరదృష్టి గల రాజనీతిజ్ఞుడు, భారత రాజకీయాలలో నిష్ణాతుడు, ప్రజా సేవలో తన విశేషమైన కెరీర్‌లో, ఆయన అణగారిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారు. పార్టీలకు అతీతంగా ఆయన నాయకత్వం అభిమానాన్ని, గౌరవాన్ని పొందింది. శ్రీ మన్మోహన్ సింగ్ వారసత్వం దేశ నిర్మాణ సాధనలో తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి." --జేపీ నడ్డా, బీజేపీ నేత, కేంద్ర మంత్రి'ఎప్పటికీ గుర్తుండిపోతారు' "మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. ఆయన కుటుంబ సభ్యులకు, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా జాతికి మీరు చేసిన సేవకు ధన్యవాదాలు. మీ ఆర్థిక విప్లవానికి మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. దేశానికి మీరు ప్రగతిశీల మార్పులుతీసుకువచ్చారు." --రాబర్ట్ వాద్రా, కాంగ్రెస్ నేత ఈ దేశం కోసం, ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన నేత, దేశ పేద ప్రజల కోసం తపించిన నిజమైన ఆర్థిక మేధావి, ఈ దేశాన్ని బాగు కోసం, నిరంతరం తపించిన నిజమైన భారత హీరో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని లోక్సత్తా నేత జయప్రకాష్ నారాయణ అని అన్నారు నివాళులర్పించిన ప్రముఖులు జయప్రకాష్ నారాయణ ఉన్నారు
Admin
Viswas Tv