విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : వైద్యం నారాయణా హరి అంటారు ప్రాణం కాపాడాలంటే 60వేలు ఇవ్వాలిసిందే 30పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ ఆడింది అటా,పాడింది పాట ప్రభుత్వ ఆసుపత్రికి చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంవల్లే డాక్టర్లు రెచ్చిపోతున్నారా!!! పేదలకు అందవలసిన వైద్యం, అమ్ముకుంటున్న ప్రభుత్వ డాక్టర్లు!! మూడు రోజులు పాటు బాధితురాలకు నరకం ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన బంధువులు ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులే... ఒక మహిళకు మూడు రోజుల పాటు నరకం చూపించారనే ఆరోపణలు విశాఖపట్నం జిల్లాలో కలకలం రేపుతున్నాయి. సాధారణ చికిత్సతో నయం కావాల్సిన వ్యాధికి సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం చేశారని... పైగా డబ్బుల కోసం బేరసారాలు కూడా చేశారంటూ బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చివరకు పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించి లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రాణాలు కాపాడుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు గోపాలపట్నం 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఏం జరిగింది...? బాధితురాలు చెబుతున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. విశాఖపట్నంలోని గోపాలపట్నం 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిల్యులైటిస్ వ్యాధితో ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు సరైన చికిత్స అందించకుండా... మూడు రోజుల పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితురాలు ఆరోపిస్తోంది. తనకు ఉన్న అసలు సమస్యను గుర్తించి చికిత్స చేయాల్సిన వైద్యులు... జ్వరానికి మాత్రమే మందులు ఇచ్చి కాలయాపన చేశారని ఆమె చెబుతోంది. దీంతో ఇన్ఫెక్షన్ మరింత తీవ్రమై పరిస్థితి విషమించిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా... మెరుగైన చికిత్స కోసం రూ.60 వేల వరకు ఖర్చవుతుందని చెప్పి బేరసారాలు చేశారని కూడా బాధితురాలు ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందాల్సిన వైద్య సేవల స్థానంలో డబ్బుల కోసం ఒత్తిడి తీసుకొచ్చారని ఆమె వాదిస్తోంది. రోజులు గడుస్తుండగా ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో... ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందనే భయంతో కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందించడంతో ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్లు డబ్బులు ఇస్తే వైద్యం చేస్తామని చెప్పటం విడ్డూరంగాఉంది దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తాం!! ఈ ఘటనపై బాధితురాలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. *** పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఉచితo అని ప్రభుత్వం చెప్తుంది నిజమా కాసులుకి కక్కుర్తి పడుతున్న డాక్టర్లు!!! ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలనే లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే కొందరు వైద్యుల నిర్లక్ష్యం లేదా అవినీతి ఆరోపణలు మొత్తం వైద్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గోపాలపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో బాధితురాలు చేసిన ఆరోపణల్లో నిజమెంత...? అధికారుల విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు మూడు రోజుల నుంచి మహిళా భాతితరాలకు నరకం చూపించే ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది గోపాలపట్నం విశాఖ పశ్చిమ నియోజకవర్గం లో ఈ దారుణానికి ఒడిగట్టిన వైద్యులు వైద్యం నారాయణ హరి అంటారు అట్లాంటి వైద్యాన్ని అమ్ముకుంటున్న కంత్రి డాక్టర్లు బాధితురాలుతో 50 వేలుకు బేరసారాలు ఆడిన ఇద్దరు డాక్టర్లు, ఒక నర్సు, చినుకు చినుకు వానై పెద్దది అవటంతో ఎమ్మెల్యే వరకు వెళ్లినట్టు సమాచారం. ఇది ఎక్కడ బయటకు వస్తే స్థానిక ఎమ్మెల్యే కి చెడ్డపేరు వస్తుందేమో అని తప్పు జరిగిందని ఒప్పుకున్న డాక్టర్లు.
Admin
Viswas Tv