విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా....దిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ (Telangana) సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల (Assembly elections 2023) నగారా మోగింది.. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటిస్తోంది. ఎన్నికల వివరాలను వెల్లడిస్తోంది. తెలంగాణ (Telangana)లో మొత్తం 119 నియోజకవర్గాలుండగా.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో 230, రాజస్థాన్ (Rajasthan)లో 200, ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో 90, మిజోరం (Mizoram)లో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో భారాస, మధ్యప్రదేశ్‌లో భాజపా, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది..
Admin
Viswas Tv