Friday, 16 January 2026 03:57:10 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

చాలా మంది వారికి తెలీకుండానే అలవాట్లో 5పనులు, పొరపాటుగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది వారికి తెలీకుండానే అలవాట్లో పొరపాటుగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే దరిద్రాన్ని ఆహ్వ

Date : 09 February 2023 12:05 PM Views : 874

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : వాస్తు Doctor: చాలా మంది వారికి తెలీకుండానే అలవాట్లో పొరపాటుగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే దరిద్రాన్ని ఆహ్వానించే ఆ పనులను చేయవద్దని సలహా ఇస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చక్కగా ఇల్లు నిర్మించుకున్నప్పటికీ, వాస్తు నియమాలను పాటించకపోతే, ఇంట్లో కొన్ని చెడ్డ అలవాట్లను కుటుంబ సభ్యులు మార్చుకోకపోతే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆర్థిక నష్టాలను చూడాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. అలవాట్లో పొరపాటుగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే దరిద్రాన్ని ఆహ్వానించే ఆ పనులను చేయవద్దని సలహా ఇస్తున్నారు.

చాలా మందిలో ఉండే చెడ్డ లక్షణం బద్ధకం.. దీని వచ్చే నష్టాలివే చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచుకోరు. చాలామంది ఇల్లు ఎప్పుడూ మురికిగా ఉంటాయి. ఇక ఎక్కడ చూసినా చెత్తాచెదారం, పాత సామాన్లు, విరిగిపోయిన వస్తువులు దర్శనమిస్తాయి. బాత్రూంలు కూడా అశుభ్రంగా దర్శనమిస్తాయి. దీనికి కారణం వారిలో ఉండే బద్ధకం. ఈ బద్ధకమను చెడు లక్షణం వల్ల ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి బద్దకంగా ఉండే అలవాటును మార్చుకొని ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం వల్ల, ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుంది.

మంచం పై కూర్చుని ఈ పనులు చేస్తే దరిద్రం.. మార్చుకోండి ఇక చాలామంది మంచం మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే అన్నపూర్ణ దేవికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది. ఇంట్లో ఆనందం శాంతికి భంగం కలుగుతుంది. మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి. కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద వద్దన్నా ఇవే పెడతారు.. ఎన్ని నష్టాలో తెలుసా ఇక చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను, చెప్పులను పెడుతూ ఉంటారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. చెత్త బుట్టలు, చెప్పులను ఇంటికి ప్రధాన ద్వారం వద్ద పెట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి రాకుండా పోతుంది. ఇంటి ప్రధాన ద్వారం ద్వారా దేవతలు ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను, చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దరిద్రానికి హేతువుగా కిచెన్ లో మనం చేసే పనులివే భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడక్కుండా ఉంచుతుంటారు. ఇది దరిద్రానికి హేతువని వాస్తు శాస్త్రం చెబుతుంది. భోజనం చేసిన తర్వాత పాత్రలు కడగకుండా మురికిగా ఉంచటం వల్ల వాటిపై శని దృష్టి ప్రభావం పెరుగుతుంది. కిచెన్ ను ఇలా అశుభ్రంగా ఉంచుకుంటే ఎంత కష్టపడి పని చేసినా సంతృప్తికరమైన ఫలితాలు రావు. కాబట్టి కిచెన్ లో ఉన్న పాత్రలను పగలైనా, రాత్రయినా ఎప్పటికి అప్పుడే కడుక్కోవడం వల్ల ఇంటికి మంచి ఫలితాలు వస్తాయి.అలవాటులో పొరబాటుగా ఈ పనులు చేస్తే దరిద్రం ఇక చాలామంది పాదాలను నేలకు రాస్తూ నడుస్తూ ఉంటారు. ఇలా పాదాలను నేలకు రాస్తూ నడవడం చెడ్డ అలవాటని, ఇలాంటి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా పాదాలను నేలకు రాస్తూ నడిచే వారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారని సూచిస్తున్నారు. ఇక అంతే కాదు కొంతమంది కూర్చున్నప్పుడు ఊరికే కాళ్లు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం కూడా అశుభ సంకేతాలను ఇస్తుందని, ఇంటికి దరిద్రాన్ని తెస్తుందని చెబుతున్నారు ఇలా చేసే వారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారని, ఇలాంటి వారిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అందుకే పొరపాటున కూడా కాళ్లు నేలకు రాస్తూ నడవడం, కాళ్లు ఊపుతూ కూర్చోవడం చేయకూడదని సూచిస్తున్నారు. ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని విశ్వాస్ టీవీ ధ్రువీకరించలేదు........

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :