విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : విశ్వాస్ టీవీ : హైదరాబాద్ :ఏపీకి చెందిన పలువురు నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో(BRS) చేరారు. మాజీమంత్రి రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్, చింతల పార్థసారథి సహా టీజే ప్రకాశ్, తాడివాక రమేశ్ నాయుడు, గిద్దల శ్రీనివాస్ నాయుడు, జెటి రామారావు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి అహ్వానించారు కేసీఆర్. బీఆర్ఎస్ ఏ ప్రాంతం కోసమో, ఏ వర్గం కోసమే ఏర్పడలేదని.. ఇది దేశం కోసం ఏర్పడిందని కేసీఆర్ అన్నారు. లక్ష అడుగుల ప్రయాణమైనా.. ఒక్క అడుగుతోనే మొదలవుతుందని చెప్పారు. సమీప భవిష్యత్తులో అందరికి ట్రైనింగ్ క్లాసులు ఉంటాయని.. బీఆర్ఎస్ ఎందుకు ఏర్పడిందనే దానిపై సవివరంగా చెబుతామని తెలిపారు. అసలు ఇప్పుడు దేశం దిశ ఏమిటనేది ఎవరికి తెలియదని కేసీఆర్ అన్నారు. ఏం చేసి అయినా ఎన్నికలు గెలవడమే లక్ష్యంగా దేశంలోని రాజకీయాలు సాగుతున్నాయని అన్నారు. అలాంటి రాజకీయాలకు స్వస్తి చెప్పి వ్యవస్థీకృతమైన విధానం రావాలని.. దాని కోసమే బీఆర్ఎస్ పని చేస్తుందని కేసీఆర్ అన్నారు. దేశంలో సహజ వనరులకు, మానవ వనరులకు కొరత లేదని తెలిపారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తే.. దేశంలోని 40 కోట్ల ఎకరాల భూమి పండించడం సాధ్యమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాకముందే ఇక్కడ కూడా కరెంట్ కష్టాలు ఉన్నాయని.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులు పోవాలని.. అందుకే బీఆర్ఎస్ వచ్చిందని అన్నారు. దేశంలో పరిస్థితులు మారాలన్న కేసీఆర్.. ఏపీలో పార్టీ విస్తరణకు ఏ విధంగా ముందుకు వెళతారు ? ఏపీతో తెలంగాణకు ఉన్న సమస్యల విషయంలో ఏ విధమైన ధోరణి అవలంభిస్తారనే అంశాలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Admin
Viswas Tv