Friday, 16 January 2026 03:57:08 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

తెలంగాణ రాష్ట్రo బరిలో ప్రియాంక గాంధీ !

Date : 22 January 2023 07:36 PM Views : 875

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ పోరు వెనుకబడిన కాంగ్రెస్ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. తెలంగాణలో బలమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం ఏఐసీసీ ముఖ్య నేతలు ఫోకస్ చేస్తున్నారు. రాష్ట్ర నేతలు కొత్త ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. కొత్త ఇంఛార్జ్ థాక్రే పార్టీ నేతలకు హైమాండ్ సందేశం స్పష్టం చేసారు. పార్టీ నేతలు ప్రజలతో మమేకం అయ్యేందకు పాద యాత్రలకు సిద్దమయ్యారు. ఇదే సమయంలో గాంధీ కుటుంబానికి ఒక కీలక ప్రతిపాదన పంపారు. ఇప్పుడు అదే తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది........ గాంధీ కుటుంబానికి తాజా ప్రతిపాదన తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర నేతల మధ్య అనైక్యత ప్రత్యర్ధి పార్టీల ఎదుగుదలకు అవకాశంగా మారుతోందని ఇంఛార్జ్ లు సైతం ఏకీభవిస్తున్నారు. ఇదే సమయంలో స్వయంగా ప్రియాంక గాంధీ తెలంగాణ వ్యవహారాల పైన ఫోకస్ పెట్టారు. ఇంఛార్జ్ ల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ప్రియాంకను కోరుతూ రాష్ట్ర నేతలు ప్రతిపాదన పంపినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రెండు లోక్ సభ స్థానాలను సూచించారు. మెదక్ లేదా మహబూబ్ నగర్ నుంచి పోటీ అంశం పరిశీలించాలని కోరారు. దీంతో లోక్ సభ కంటే ముందుగానే జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం సానుకూల ఫలితాలు ఇస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

మెదక్ నుంచి నాడు ఇందిరా గెలుపు 1980 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా నాడు ఇందిరాగాంధీ పోటీ చేసి విజయం సాధించారు. నాడు ఇందిరకు 301577 ఓట్లు వచ్చాయి. ఇందిర నాటి ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేయటంతో మొత్తం 42 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ 41 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు బీఆర్ఎస్ - బీజేపీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉందని.. తెలంగాణ నుంచి ప్రియాంక పోటీ చేస్తే ముందుగా జరిగే అసెంబ్లీతో పాటుగా.. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల పైనా ప్రభావం ఉంటుందని వివరించేందుకు టీపీసీసీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ పైన గాంధీ కుటుంబం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా.. ప్రియాంక తెలంగాణ నుంచి ఎన్నికల బరిలో దిగేందుకు ముందుకు వస్తారా లేదా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

బీజేపీ - బీఆర్ఎస్ తో పోటీ పడేలా.. తెలంగాణలో గులాబీ - కాషాయం పార్టీలు హోరా హోరీగా తల పడుతున్నాయి. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే అసలు సమస్యగా మారుతున్నాయి. కొత్త ఇంఛార్జ్ చికిత్స మొదలు పెట్టారు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం నమోదు చేసుకొనేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు బీజేపీ కోసం స్వయంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగుతున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ కు కూడా గాంధీ కుటుంబం నుంచి మద్దతు కావాలని రాష్ట్ర నేతలు కోరుతున్నారు. ఆ ఇద్దరికి పోటీ ఇచ్చేలా ప్రియాంక రాష్ట్రంలో మొహరిస్తే..పార్టీలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాష్ట్ర నేతలు అభ్యర్ధనలను ప్రియాంక ఎంత వరకు ఆమోదిస్తారనేది చూడాలి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :