Saturday, 13 June 2026 10:02:31 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

మెడికో ప్రీతి కేసులో, రోజుకో ఒక మలుపు.అసలు పాయిజన్ తీసుకోలేదు సిన్ మొత్తం రివర్స్.. !

Date : 06 March 2023 08:48 AM Views : 1020

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : తెలంగాణను ఉలిక్కిపడేలా చేసిన మెడికో ప్రీతి కేసులో దిమ్మదిరిగే ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇన్ని రోజులు.. సీనియర్ల వేధింపులు భరించలేక ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించింది అనుకుంటే... ఇప్పుడు వచ్చిన టాక్సికాలజీ రిపోర్టు సీన్ మొత్తాన్ని రివర్స్ చేసి పారేసింది. టాక్సికాలజీ రిపోర్టు ఇప్పుడు ఈ కేసును మరో కొత్త మలుపు తిప్పబోతోంది. ఈ రిపోర్టు ఇప్పటికే.. వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి అందగా.. ఆయన రేపు హైదరాబాద్‌లోని పోలీసు బాస్ దగ్గరికి రానున్నారు.

తెలంగాణలో సంచలనంగా మారిన మెడికో ప్రీతి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పోలీసులకు ప్రీతి కేసు సవాల్‌గా మారింది. ఇప్పటికే.. నిందితుడు సైఫ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులతో పాటు.. అటు మిగతా జూనియర్ డాక్టర్లను కూడా యాంటీ ర్యాంగిగ్ కమిటీ విచారిస్తోంది. కాగా.. ప్రీతి, సైఫ్.. మొబైల్స్‌లోని చాటింగ్‌లతో పాటు జూనియర్ డాక్టర్ల ఫోన్లలోని సాంకేతిక ఆధారాలను కూడా సేకరించి.. లోతుగా విశ్లేషిస్తున్నారు. అయితే.. ఈ కేసులో వచ్చిన టాక్సికాలజీ రిపోర్టు ఇప్పుడు దిమ్మదిరిగే ట్విస్ట్ ఇచ్చింది. ఇన్ని రోజులు.. ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించిందని అంతా అనుకుంటే.. ఇప్పుడు వచ్చి టాక్సికాలజీ రిపోర్టు సీన్ మొత్తాన్ని రివర్స్ చేసేసింది. ప్రీతి బాడీలో ఎలాంటి ఎలాంటి విష పదార్థాలు కానీ, రసాయనాలు గానీ లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్‌లో వెల్లడైంది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాలను పరిశీలించిన వైద్యులకు.. ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్‌లో వెల్లడించారు

కాగా.. ఈ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ చేతికి చేరింది. దీంతో.. ఇన్ని రోజులు ఆత్మహత్యాయత్నం కేసుగా పరిగణించిన కేసును.. ఇప్పుడు అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు పడ్డారు. ఈ నేపథ్యంలోనే వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ రేపు హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ డీజీపీ నుంచి సీపీకి ఫోన్ వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే ఈ కేసు గురించి వివరించేందుకు సీపీ నేరుగా హైదరాబాద్ రానున్నట్టు సమాచారం. మరోవైపు.. నిందితుడు సైఫ్ హోం మంత్రికి సమీప బంధువు అంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే.. ప్రీతి మృతి.. అసలు హత్యా.. ఆత్మహత్యా.. అన్న విషయం ఎటూ తేల్చుకోలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే.. ముందు నుంచి ప్రీతిది హత్యే అంటూ ఆమె కుటుంబసభ్యులు మాత్రం వాదిస్తూనే ఉన్నారు. అందుకు సంబంధించి.. పలు అనుమానాలను కూడా ప్రీతి తండ్రి మీడియా ముందు వ్యక్తం చేశారు. ప్రీతి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చుకుని ఉంటే.. శరీరంపై ఎలాంటి ఆనవాళ్లు కనిపించలేదంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రీతి స్పృహలో లేనప్పుడు ఆమె ఫోన్‌లో పాయిజన్ ఇంజెక్షన్ గురించి సెర్చ్ చేసి.. కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారంటూ ఆరోపించారు కూడా. ముందు నుంచి వాళ్లు ఆరోపిస్తున్నట్టుగానే.. ఆమె శరీరంలో ఎలాంటి విష పదార్థాలు దొరకపోవటం పెద్ద ట్విస్టే. ఈ కేసులో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్ని సర్వత్రా ఉత్కంఠగా మారింది...

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :