Saturday, 13 June 2026 10:03:35 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఒకే రోజు న్యూజిలాండ్ లో తల్లి, హైదరాబాద్ లో కొడుకు మృతి

Date : 04 February 2023 05:11 PM Views : 954

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఉన్నత చదువులు, ఉపాధి కోసం ఎంతో మంది విదేశాలకు వెళ్తుండటాన్ని చూస్తున్నాం. మన దేశం నుంచి చాలా మంది స్టూడెంట్స్, ఎంప్లాయీస్ యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్తున్నారు. మెరుగైన భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన వారిలో ఎంతో మంది సక్సెస్ అయ్యారు. అయితే లక్షల జీతం అందుకుంటున్నా, లగ్జరీ లైఫ్ ఉన్నా కానీ స్వదేశానికి దూరంగా ఉన్నామనే బాధ వారిలో ఉంటుంది. అందుకే కుదిరినప్పుడల్లా సొంతూళ్లకు వచ్చి పోతుంటారు. తమ వారిని కలిసి, పాత రోజులను గుర్తు చేసుకుంటారు. అలాగే తమ పిల్లల్ని కూడా వెంట తీసుకొచ్చి మన దేశ సంస్కృతి, సంప్రదాయాలను అలవాటు చేస్తుంటారు.

ఇలాగే ఓ తండ్రి తన కొడుకును ఇండియాకు తీసుకొచ్చాడు. ఇక్కడి కల్చర్‌తో పాటు క్రమశిక్షణను నేర్చుకుంటాడని అనుకున్నాడు. ఇంతలోనే దారుణం జరిగింది. సైక్లింగ్ చేస్తున్న ఆ బాలుడ్ని ఓ బైక్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా, హయత్ నగర్‌లో ఇంద్రప్రస్థ కాలనీలో చోటుచేసుకుంది. సురేందర్ రెడ్డి, స్వర్ణలక్ష్మి అనే దంపతులు న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు. వీళ్లిద్దరూ న్యూజిలాండ్ సిటిజన్స్ కావడం గమనార్హం. అక్కడ చదువుతున్న 13 ఏళ్ల తన కొడుకు సాయి శ్రీకాంత్ రెడ్డిని ఇండియా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి తీసుకొచ్చాడు సురేందర్ రెడ్డి. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు పిల్లలకు తెలియాలని ఆయన భావించాడు. అయితే సాయి శ్రీకాంత్ రెడ్డి సైక్లింగ్ చేస్తుండగా ఇద్దరు మైనర్లు బైక్ నడుపుతూ ఢీకొట్టారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు.

క్రమశిక్షణ నేర్పించాలని తన కొడుకు సాయి శ్రీనివాస్‌ను ఇక్కడకు తీసుకొస్తే.. మైనర్ల నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా బలయ్యాడని వాపోయాడు సురేందర్ రెడ్డి. న్యూజిలాండ్‌లోనే ఉన్నా తన కొడుకు బతికేవాడని కన్నీరుమున్నీరయ్యాడు. బాలుడి తల్లికి ఈ విషయం ఇంకా తెలియదట. ఆమె ఇవాళ సాయంత్రం న్యూజిలాండ్ నుంచి ఇక్కడకు రానున్నారు. చాన్నాళ్ల తర్వాత బిడ్డను చూసేందుకు వస్తున్న ఆ తల్లి.. విగతజీవిగా మారిన కొడుకును చూసి ఎలా తట్టుకుంటుందోనని తల్లడిల్లుతున్నారు కుటుంబ సభ్యులు. మరి, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న మైనర్ల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యల గురించి మీ అభిప్రాయాలు కామెoట్ల రూపoలో రాయండి

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :