Tuesday, 15 September 2026 05:27:22 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

పాదయాత్ర ముందు, నారా లోకేష్ ప్రజలకు బహిరంగ లేక విడుదల....

హైదరాబాద్ హౌస్ లో పాదయాత్ర ముందు తల్లి తండ్రలు ఆశీర్వాదo తీసుకున్న నారా లోకేష్

Date : 26 January 2023 05:23 PM Views : 1029

విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ 'యువగళం' పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలసిందే.జనవరి 27వ తేదీ నుంచి యువగళం పాదయాత్రను కుప్పం నుంచి ప్రారంభిస్తారు. అయితే, పాదయాత్రకు ముందు ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారు. తనను ఆశీర్వదించాలంటూ ప్రజలను కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం పాలనను బేరీజు వేస్తూ.. అభివృద్ధి పనులు, పాలనా విధానాలను పేర్కొన్నారు. టీడీపీకి మరోసారి అధికారం ఇచ్చి.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు నారా లోకేష్. లోకేష్ బహిరంగ లేఖ సారాంశం..'లోటు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రాన్ని ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం గాడిలో పెట్టి, నవ్యాంధ్ర నిర్మాణానికి చాలా కృషి చేసింది. ఈ విషయం మీకు తెలిసిందే. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసం మీరంతా చూస్తూనే ఉన్నారు. ప్రతివర్గం మాకొద్దీ అరాచకపాలన అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పరిశ్రమలు ఎలాగూ రావడంలేదు. ఉన్నవీ తరిమేస్తున్నారు. కుల, మత, ప్రాంతాల పేరుతో విద్వేషాలు ఎగదోసి వికృత రాజకీయానికి తెరలేపారు. ఈ అరాచక పాలన పోవాలి. అందుకే మీ ముందుకు వస్తున్నాను. యువతకి భవితనవుతాను. అభివృద్ధికి వారధిగా నిలుస్తాను. రైతన్నని రాజుగా చూసేవరకూ విశ్రమించను. ఆడబిడ్డలకు సోదరుడిగా రక్షణ అవుతాను. మీరే ఒక దళమై, బలమై నా యువగళం పాదయాత్రని నడిపించండి. మీ అందరి కోసం వస్తున్న నన్ను ఆశీర్వదించండి.. ఆదరించండి.' అంటూ ప్రజలను కోరారు నారా లోకేష్. యువగళం పాదయాత్రకు బయలుదేరే ముందు నారా లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మానాన్న(నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి), అత్తమామలు(నందమూరి బాలకృష్ణ, వసుంధర) నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు లోకేష్. ఇక ఆయన సతీమణి నారా బ్రాహ్మణి.. హారతి పట్టి, బొట్టు పెట్టి, విషెస్ చెప్పారు. ఇంటి నుంచి బయలుదేరే తండ్రి చంద్రబాబును ఆలింగనం చేసుకుని ఆత్మీయత పంచుకున్నారు లోకేష్. కాగా, ఇంటి నుంచి లోకేష్ నేరుగా ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు. అటు నుంచి కడప చేరుకుంటారు. అక్కడి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు లోకేష్. అదే సమయంలో కడపలోనే ఓ చర్చ్ లోనూ లోకేష్ ప్రార్థనలు చేస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకుని అక్కడే బస చేస్తారు. గురువారం నాడు(26వ తేదీ) శ్రీవారిని దర్శించుకుంటారు లోకేష్. ఉదయం 10 గంటలకు తిరుమల నుంచి కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుంటారు. 27వ తేదీ నుంచి కుప్పం నుంచి తన యువగళం పాదయాత్రను ప్రారంభిస్తారు నారా లోకేష్.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: