విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి వెంబడించి కత్తులు, కటార్లతో పొడిచి చంపారు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు. రోడ్డుపై వెళ్తున్న జనం చూస్తుండగానే ఈ లైవ్ మర్డర్ జరిగింది. హంతకుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి వెంబడించి కత్తులు, కటార్లతో పొడిచి చంపారు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు. రోడ్డుపై వెళ్తున్న జనం చూస్తుండగానే ఈ లైవ్ మర్డర్ జరిగింది. ఈ మర్డర్ పురానాపూల్(Puranapool)సమీపంలోని జియాగూడ బైపాస్ రోడ్డు దగ్గర చోటుచేసుకుంది. దుండగుల చేతిలో హతమైన వ్యక్తి కోఠి ఇస్లామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్(Jangam Sainath)గా పోలీసులు గుర్తించారు. హత్య చేసి పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన జరిగిన పరిసరాల్లోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.
Admin
Viswas Tv