Saturday, 13 June 2026 08:42:18 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

Vizag Steel Plant | వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలుకు మోకాలడ్డిన మోదీ సర్కారు ‌.. రాష్ట్ర ప్రభుత్వాలు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా రూల్

Date : 21 April 2023 08:03 PM Views : 1003

విశ్వాస్ టీవీ - తెలంగాణ / విశాకపట్నం జిల్లా : Vizag Steel Plant | ప్రైవేటీకరణే ఏకైక మంత్రంగా పనిచేస్తున్న మోదీ సర్కారు.. తాను పట్టిన పట్టు సాధించేందుకు ఎంతదూరమైనా వెళ్తున్నది. ఎంతదూరమంటే ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న సంస్థలను మరో ప్రభుత్వరంగ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ కొనుగోలు చేయాలనుకొంటే ఎంతమాత్రం వీలు లేకుండా నిబంధనలు రూపొందించింది.

Vizag Steel Plant !విశాఖపట్నం , ఏప్రిల్‌ 21 విశ్వాస్ టీవీ న్యూస్ ): ప్రైవేటీకరణే ఏకైక మంత్రంగా పనిచేస్తున్న మోదీ సర్కారు.. తాను పట్టిన పట్టు సాధించేందుకు ఎంతదూరమైనా వెళ్తున్నది. ఎంతదూరమంటే ప్రైవేటీకరణ జాబితాలో ఉన్న సంస్థలను మరో ప్రభుత్వరంగ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ కొనుగోలు చేయాలనుకొంటే ఎంతమాత్రం వీలు లేకుండా నిబంధనలు రూపొందించింది. అంటే మోదీ సర్కారు ఒక పీఎస్‌యూను అమ్మకానికి పెడితే తాహతు, స్థోమత, అవకాశం, ఆసక్తి ఉన్నా మరో ప్రభుత్వరంగ సంస్థ కొనలేదు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఇదే జరిగింది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని నినదించి సాధించిన ఈ సంస్థను కచ్చితంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే పెట్టాలని కేంద్ర ప్రభుత్వం అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నది. నిజానికి వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్‌ పరం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కృషి చేసింది. చివరి క్షణం వరకు అన్ని విధాలుగా ప్రయత్నించింది. అయితే కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారడంతో బిడ్డింగ్‌ నుంచి వెనక్కి తగ్గిందని అధికారులు తెలిపారు. తీవ్రంగా ప్రయత్నించిన తెలంగాణ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం తన కార్పొరేట్‌ మిత్రులకు అగ్గువకు అమ్మేస్తుండటాన్ని వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్‌ ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఈ క్రమంలో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్‌ పరం చేయాలని నిర్ణయించటంతో, దానిని అడ్డుకోవాలని ప్రయత్నించారు. ప్రైవేటీకరణను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ‘మీరు ప్రైవేట్‌కు అమ్మేసినా.. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాగానే మళ్లీ టేకోవర్‌ చేస్తాం’ అని కూడా హెచ్చరించారు. అయినా మోదీ ప్రభుత్వం చెవికి ఎక్కించుకోలేదు. ప్లాంట్‌ కనీస విలువను రూ.3,500 కోట్లుగా నిర్ధారించి, ఆసక్తి ఉన్నవారు బిడ్లు వేయాలని కోరింది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్‌ ప్రైవేట్‌ పరం కాకుండా కాపాడాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించి సింగరేణి సంస్థ ద్వారా ప్లాంట్‌ టేకోవర్‌ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బృందాన్ని పంపి ప్లాంట్‌ పరిస్థితిపై అధ్యయనం చేయించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ప్రభుత్వరంగ సంస్థల విక్రయానికి వేసే టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వాలుగానీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలుగానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలున్న సంస్థలుగానీ, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కో ఆపరేటివ్‌ సొసైటీలుగానీ పాల్గొనవద్దని నిబంధనల్లో పేర్కొన్నది. ఒకవేళ ఎవరైనా బిడ్డింగ్‌లో పాల్గొనదలిస్తే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా.. ఇచ్చే పరిస్థితి లేదు. ఈ కారణాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ బిడ్డింగ్‌లో పాల్గొనలేదని అధికారులు తెలిపారు.

పక్కా వ్యూహంతో నిబంధనల రూపకల్పన ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ తన మిత్రులైన ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు మోదీ సర్కారు పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. అమ్మదల్చుకొన్న సంస్థను మరే ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థగానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థగా, ప్రభుత్వాలుగానీ, ప్రభుత్వాల పరిధిలోని సహకార సంస్థలుగానీ దక్కించుకోకుండా 2022లోనే కచ్చితమైన నిబంధనలు రూపొందించి ఆ ఏడాది ఏప్రిల్‌ 19న అన్ని రాష్ర్టాలకు సర్క్యులర్‌ జారీచేసింది. పై సంస్థలతోపాటు ప్రభుత్వాలు పీఎస్‌యూల కొనుగోలు బిడ్డింగ్‌లో పాల్గొనరాదని స్పష్టంగా పేర్కొన్నది. విశాఖ స్టీల్‌ ప్లాంటు బిడ్డింగ్‌లో పాల్గొనకుండా సింగరేణికి ఇప్పుడు ఈ నిబంధనలే అడ్డుగా నిలిచాయి.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :