విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ సందడే వేరు, అందులోనూ ఆడపిల్లలు కాళ్లకు పట్టీలు వేసుకుని బుడిబుడి అడుగులు వేసుకుంటూ నడుస్తూ ఉంటే, అబ్బా ఎంత బాగుంటుందో కదా, ఆ ఇంట్లో సందడి కూడా అలాగానే ఉండేది, చాలా ఏళ్ల తర్వాత పుట్టిన పాప, ఇంకేంటి కంటికి రెప్పలా కాపాడుకున్నారు.గారాబంగా పెంచారు అడిగింది ఎల్లా కళ్ళ ముందుకు తెచ్చి పెట్టారు, కానీ ఒక చిన్న చాక్లెట్ ఆ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకుంది. పిల్లలు స్కూల్ కి వెళ్ళను అనడం సర్వసాధారణం, అయితే కొందరు తల్లిదండ్రులు తిట్టి కొట్టి భయపెట్టి పంపిస్తారు. మరికొందరు బుజ్జగిన్చి ఏ చాక్లెట్ బిస్కెట్ లేదా డబ్బులు ఇచ్చి పంపిస్తారు.
లేదా నేరుగా స్కూలుకు తీసుకువెళ్లి దిగబెట్టి వస్తారు. అందరూ పిల్లల లాగానే ఈ చిన్నారి కూడా అలాగే చేసింది, స్కూల్ కి వెళ్ళను అని మారం చేసింది, అప్పటి వరకు తల్లిదండ్రులతో ఆడుకుంది కానీ సడన్గా కుప్పకూలి చనిపోయింది. దానికి కారణం చాక్లెట్, ఒకే ఒక చాక్లెట్. కర్ణాటకలోని ఉడిపి జిల్లా బయనదూరు సమీపంలో ఉన్న బెజోరు గ్రామానికి చెందిన సమన్వయ అనే బాలిక స్థానిక వివేకానంద స్కూల్లో మొదటి తరగతి చదువుతోంది. ఉదయం స్కూలుకు వెళ్ళను అని చిన్నారి మారం చేసింది, తల్లిదండ్రులు బాలికను బుజ్జగించారు, అయినా సరే వెళ్ళను అంటే వెళ్ళను అని చెప్పింది.దీంతో కూతుర్కే చాక్లెట్ ఇచ్చి స్కూల్ కి పంపాలి అనుకున్నారు తల్లిదండ్రులు. ఇంట్లో ఉండే చాక్లెట్ ఇచ్చారు, దీంతో స్కూల్ కి వెళ్తానని చెప్పింది. ఒకపక్క స్కూల్ కి టైం అవుతుండగా సమన్వి చాక్లెట్ తింటూ కూర్చుంది, అప్పుడే స్కూల్ బస్సు వచ్చింది, దీంతో హడా ఒడిలో చాక్లెట్ గుట్టుకున్న మింగి స్కూల్ బస్సు వైపు పరుగులు పెట్టింది, అంతే బస్సు డోర్ దగ్గర ఒక్కసారిగా కుప్పకూలింది, దీంతో చిన్నారిని గమనించిన తల్లిదండ్రులు హుటా హుటిన ఆమెను దగ్గరలోనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా, పరీక్షించిన వైద్యులు చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు.
Admin
Viswas Tv