విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : కంద గురించి తెలిసిన వారు ఎక్కువే అయినా, తినే వారు తక్కువే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కందతో రుచికరమైన వంటకాలు తయారు చేయడం అందరికీ తెలిసిన విద్య కాదు. పైగా గడ్డ కూరలు ఎక్కువగా తినకూడదన్న అభిప్రాయం కూడా కందను ఎక్కువ మంది తినకపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. కానీ, కందలో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మెదడుకి మంచిది కందను జిమికంద్, ఎలిఫెంట్ ఫూట్ యామ్, కర్ణాటకలో సువర్ణ గడ్డ ఇలా దేశవ్యాప్తంగా ప్రతీ ప్రాంతంలోనూ దీన్ని భిన్నమైన పేరుతో పిలుస్తుంటారు. ఇందులో డియోస్ జెనిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. మెదడులో న్యూరాన్ల వృద్ధికి ఇది సాయపడుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక కందగడ్డను తరచుగా కూరల్లో భాగంగా తీసుకుంటే మెదడు ఆరోగ్యంతోపాటు, జ్ఞాపకశక్తి చురుగ్గా మారుతుంది. ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది కందలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి శరీరంలో ఉన్న ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి. మధుమేహం, గుండె జబ్బులు, స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఇందులో ఉన్నాయి. రక్తంలో సీఆర్పీ ఎక్కువగా ఉన్నవారు కందను తినడం మంచిది. కేన్సర్ నిరోధకం కందలో యాంటీ ఆక్సిడెంట్లతోపాటు, కేన్సర్ నిరోధక గుణాలు సైతం ఉన్నాయి. కొలన్ కేన్సర్ వృద్ధిని ఇది అడ్డుకుంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. కొలెస్ట్రాల్ తగ్గుముఖం చెడు కొలెస్ట్రాల్ ను ఇది తగ్గిస్తుంది. కందలో ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీనివల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డీఎల్, వీఎల్డీఎల్ తగ్గుతాయి. పీచు కూడా ఉండడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణ సమస్యలకు మందు మలబద్ధకం తదితర సమస్యలకు కంద పనిచేస్తుంది. జీర్ణాశయం ఆరోగ్యానికి సాయపడుతుంది. మంచి బ్యాక్టీరియా (ప్రో బయాటిక్)ను కలిగి ఉంటుంది....
Admin
Viswas Tv