విశ్వాస్ టీవీ - తెలంగాణ / హైదరబాద్ : Rakesh master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (Rakesh master) కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్న రాకేష్ మాస్టర్‌ను కుటుంసభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
Rakesh master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ (Rakesh master) కన్నుమూశారు. రాకేష్ మాస్టర్ వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ నుండి హైదరాబాద్‌కు తిరిగి రాగా.. అప్పటి నుండి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స చేయించుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇవాళ ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకున్న రాకేష్ మాస్టర్‌ను కుటుంబసభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
డాక్టర్లు చికిత్స కొనసాగిస్తుండగా.. రాకేష్ మాస్టర్ తుదిశ్వాస విడిచారు. డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టిన రాకేష్ మాస్టర్.. సుమారు 1500 సినిమాలకు పనిచేశారు. రాకేష్ మాస్టర్ వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోతో హాట్ టాపిక్‌గా నిలుస్తుండేవాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫాలోవర్లు, అభిమానులు దేవుడిని ప్రార్థిస్తున్నారు. రాకేష్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ.. సహచర డ్యాన్స్ మాస్టర్ల మీద తనదైన సెటైరికల్, కాంట్రవర్సియల్ కామెంట్స్‌తో ఎప్పడూ వార్తల్లో నిలుస్తుండేవాడు.
Admin
Viswas Tv