విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఉక్కు ప్రజాగర్జనను జయప్రదం చేయండి ఉక్కు ఉద్యమాన్ని రెండవ దశలోకి తీసుకువెళ్లడంలో భాగంగా జనవరి 30వ తారీకు జరుగుతున్న ఉక్కు ప్రజా గర్జనను జయప్రదం చేయండి అని స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటిదాస్ పిలుపునిచ్చారు. నేడు ఉక్కునగరం సిఐటియు కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేటి వరకు కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాన్ని నిర్వహించిందని ఈ సమస్యపై ఐక్యతను రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికే ఉక్కు ప్రజా గర్జనలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. కనుక ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్మికుడు భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ఉన్న పార్టీలకు వివిధ ఎజెండాలు ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగడం ద్వారానే ఉందన్న సత్యాన్ని వివిధ పార్టీల ప్రతినిధులు ఒప్పుకుంటున్నారని ఆయన వివరించారు. అందులో భాగంగానే ఈనెల 23 వ తారీఖున గాజువాక లో ఉన్న 21 మంది కార్పొరేటర్లతో వెస్ట్ రామచంద్ర హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. దీనిలో స్థానిక శాసనసభ్యులు మరియు స్థానిక కార్పొరేటర్లు పాల్గొంటున్నారని దీన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రతిపాదనలో ప్రభుత్వ రంగ పరిశ్రమల అమ్మకాలపై ఈ పోరాటం ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. కనుక ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఉక్కు ప్రజా గర్జనను ప్రతి ఒక్కరూ జయప్రదం కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్టీల్ సిఐటియు ప్రతినిధులు బి అప్పారావు, పి శ్రీనివాసరాజు, గంగాధర్, యు వెంకటేశ్వర్లు, మరిడయ్య, నీలకంఠం, కృష్ణమూర్తి, పుల్లారావు, శశి రెడ్డి, ఉమామహేశ్వరరావు, ఆర్ రాజేశ్వరరావు, బిఎన్ మధుసూదన్, మొహిద్దిన్, సూర్యనారాయణ, కె బాలశౌరి, కె సత్యనారాయణ తదితరులతో పాటు వివిధ విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు.
Admin
Viswas Tv