విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : దేశంలో తిరుగులేని రాజకీయపార్టీగా అవతరించిన భారతీయ జనతాపార్టీకి 2023వ సంవత్సరం అత్యంత క్లిష్టమైన సవాల్ ను విసరబోతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల రాజకీయ చాణక్యానికి కఠిన పరీక్ష ఎదురుకాబోతోంది. దీన్ని అధిగమిస్తేనే 2024లో మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అయితే బీజేపీకి కష్టకాలం ఎదురవబోతోంది. ఒక్క సంవత్సరంలోనే 9 రాష్ట్రాలకు.. షెడ్యూల్ ప్రకారం 2024 ఏప్రిల్ లేదా మే నెలలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి హ్యాట్రిక్ విజయం అందుకుంటుందా? లేదంటే ప్రాంతీయ పార్టీలతో కూడిన కూటమికి ఎదురు నిలవలేదా? అనేది తేలిపోయేది ఈ ఏడాదే. అది ఫైనల్ గా భావిస్తే ఇవి సెమీ ఫైనల్స్. ఒక్క సంవత్సరంలోనే 9 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మోడీ-షా రంగంలోకి దిగడంతోపాటు వ్యూహ, ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈశాన్య రాష్ట్రాలను మినహాయించినా పెద్ద రాష్ట్రాలన్నింటిలో విజయమే వారి ప్రణాళికగా ఉంది.
పెద్ద రాష్ట్రాల్లో అధికారం కోసం.. ప్రస్తుతానికి పార్టీ బలోపేతంగానే ఉంది. కర్ణాటక, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, తెలంగాణతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కర్ణాటక, మధ్యప్రదేశ్ లో అధికారాన్ని నిలుపుకోవడంతోపాటు రాజస్థాన్ చత్తీస్ గడ్, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఈ రాష్ట్రాల్లో ఏ ఒక్కటి కోల్పోయినా ఆ ప్రభావం వచ్చే ఎన్నికలపై పడుతుంది. మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ పెద్దలు అన్నిరకాల ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అది జరగాలంటే 9 రాష్ట్రాల్లో గెలవాలి.
మోడీ-షాకు కఠినమైన సందర్భం మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం రాష్ట్రాల్లో కూడా అధికారం చేజిక్కించుకోవాల్సి ఉంటుంది. ఇది కఠినమైన సందర్భమని పార్టీ నేతలకు తెలుసు. మొన్నటి ఎన్నికల్లో గుజరాత్ లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేజారిపోయింది. గతంలో లా నరేంద్రమోడీ క్రేజ్ కనపడటంలేదు. రోజురోజుకు ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. వరుసగా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ మీడియా, సోషల్ మీడియా ద్వారా బలంగా కనపడుతోంది. ఆయా రాష్ట్రాల్లో విజయం సాధించకపోతే అది జరగకపోవచ్చు. ఈ ఏడాదిని విజయవంతంగా ముగిస్తేనే భారతీయ జనతాపార్టీకి మేలు జరుగుతుంది. లేదంటే కష్టమే..!
Admin
Viswas Tv