విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : విశాఖపట్నం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిక్కెట్టు ఖరారుపై టిడిపిలో అసమ్మతి చెలరేగిన విషయం తెలిసిందే. ఇందులో చాలా వరకు సర్దుబాటు చేసినా కొన్నింటిలోనూ కొనసాగుతూ వచ్చాయి. ప్రధానంగా మాడుగుల,గజపతినగరం నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు,అప్పలనాయుడు అసంతృప్తితోనున్నారు. టిక్కెట్టు ఖరారవలేదన్న విషయం తెలిసిన వెంటనే రెండు నియోజకవర్గాలల్లో టిడిపి కార్యకర్తలు ర్యాలీలు,ధర్నాలు అనంతరం కూడా నిరసనల పర్వం కొనసాగుతూ వచ్చింది. ఒకనొక దశలో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారేమనన్నంతగా ప్రచారం కూడా నడుస్తుంది. అయితే పార్టీని వీడబోమన్న విషయాన్ని మాత్రం ఆ ఇద్దరు నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు మాడుగుల నుండి పీవీజె కుమార్,మాజీ ఎమ్మెల్యే రామానాయుడు ను పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదు.ఏక ఆధిపత్యంతో అనామోహుడుకి, పార్టీకి వెన్ను పోటు పొడిచిన పైలా ప్రసాదరావు కి టికెట్ ఏలా ఇచ్చారు అని చంద్రబాబు పై కూడా గుర్రుగా ఉన్నారు అని బోగొట్ట, ఇద్దురులో ఎవురో ఒకరికి ఇవ్వాలి అని ప్రకటన కూడా చేసారు... దీంతో వారు కొంతమేర వరుకు అవసరం అయితే రాజీనామా చేసి స్వత్న్రంగా పోటీకి వెనక ఆడనుఅని రామానాయుడు సన్నిహితులతో చెబుతున్నారు. అయితే వారికి ఎటువంటి హామీ లభించిందన్నది చర్చ నడుస్తోంది.కానీ పైలా ప్రసాదరావుకి కార్యకర్తలు, నాయకులును మద్దతు లేదు అనేది ఉమ్మడి ఎంపీ అభ్యర్థి సీఎం.రమేష్ కూడా చంద్రబాబుకి మాడుగులలో పైలా ప్రసాద్రావుపై వ్యతిరేకత ఉంది అని ఆలా అయితే టీడీపి ఎమ్మెల్యే,మరియు ఎంపీగా గెలవటం నల్లేరు మీద నడక అని సీఎం రమేష్ మొగమాటం లేకుండా చంద్రబాబుకి చెప్పేసారు అంట,ఎవరికీ ఇస్తే బాగుంటది అని అడిగేతే మొదటగా మాజీమంత్రి బండారు సత్యనారాయణ పేరు చెప్పారు అని వినికిడి,అయితే బండారు దానికి ఒప్పు కోవడం లేదు అని బాగోట్ట,రామానాయుడుకి ఇస్తే బాగుంటది అని రెండో ఛాయస్ రామానాయుడుకి అయితే పర్వాలేదు అని రమేష్ చెప్పారు అంట,ఇప్పటికే మాడుగులలో రామానాయుడుకి మద్దతుగా కార్యకర్తులు,ధర్నాలు,ర్యాలీలు చేస్తూనే ఉన్నారు,పార్టీకి రాజీనామా చేయటానికి వెనకడుగు వేసేది లేదు అని కార్యకర్తలు చెబుతున్నారు. పైలా వల్ల పార్టీకి నష్టం ఎక్కువుగా ఉంది అని కార్యకర్తలు చెబుతున్నారు. పైలా ఏనాడు పార్టీకోసo కాకుండా,ప్రత్యర్థి వైసీపీ పార్టీకి ఎక్కువుగా మేలు చేసేవారు అని, అలాంటి వారికి టికెట్ ఇచ్చి పార్టీని నాశనం చేయటానికి, పూనుకున్నవాళ్లకి పార్టీ టికెట్ ఇచ్చి టీడీపి కార్యకర్తలు నోటిలో మట్టి కొట్టారు అని టీడీపి అధినేత చంద్రబాబుపై మాడుగుల టీడీపి కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు అంట.పార్టీలో పైలా డబ్బులు ఖర్చు పెట్టగలరు అని అందురు అనుకున్నారు కానీ రెండురోజులు క్రితం కెనరాబ్యాంక్ లో గోల్డ్ తాకట్టు పెట్టి సుమారుగా 13లక్షలుకు పరిస్థితి వచ్చింది అంటే!,కోట్లు ఉన్నాయి అనుకున్న పైలా ప్రసాద్ దగ్గర లక్షలుకు బంగారం తాకట్టు పెట్టి టీడీపి టికెట్ గెలుస్తారు అని ఎట్లా అనుకుంటారు అని టీడీపిలో సర్పంచ్ నాయకుడు చెబుతున్నారు.!.. మసి పూసి మారడకాయ చేయటంలో పైలా అరి తేరారు అని నియాజకవర్గంలో చెప్పుకుంటన్నారు.టీడీపికి గడ్డుకాలం పూర్తిగా మాడుగుల,అనకాపల్లి ఎంపీ సిగ్మెంట్ లో కళ్ళకు పుర్తిగా కనబడుతుంది.ఇప్పటికైనా అధినేత చంద్రబాబు ఆలోచన చేసి టికెట్ బలమైన కార్యకర్తలు ఎవరికి అండగా ఉంటె వాల్లకి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటది అని కోరుచున్నారు
Admin
Viswas Tv