విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కుపైనా, ప్రజా స్వామ్య వ్యవస్థపైనా ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది_కానీ ప్రస్తుత ఉన్న పరిస్థితులు బట్టి రాసిన ఓటరుపై అవగహన తెచ్చుకోవాలి అని కోరుతూ ఓటరు సమస్యపై.. ఓటరన్నా-నువ్వు తిరగబడితేనే.ఎప్పుడు..ఎప్పుడు_ ఈ దేశం ఈజాతి,బాగుపడేదెప్పుడు.నిజాయితీగా,ఓటేయగలిగినప్పుడు._కులం పిచ్చితో.మతం మాయలో.పార్టీల గారడీలో, పడిపోక మనిషిని చూసి..అతడి గుణగణాలను,ఎంచి ఓటేయగలిగినప్పుడు.నోటుకు ఓటు అమ్మకమందుకు చిందుకు,విందుకు,లొంగిపోక.నిఖార్సైన అభ్యర్థిని.కనుగొని,నిబద్ధంగా,ఓటేయగలిగినప్పుడు.బూటకపు వాగ్దానాలు.ఆచరణ సాధ్యం కాని,హామీలు,అబద్దాలతోనే,బ్రతికే బినామీలు,మాయమాటల సునామీల దరిచేరనీయక మంచి నేతను.పోల్చి..ఆదరించి..అతడికే,ఓటేయగలిగినప్పుడు.కాసులు..కేసులు..తిరకాసులు..కక్షలు_జైలుశిక్షలు..ఎన్నున్నా, _ఎంచక.తుంచక..కోపగించక,అసహ్యించక అతడినే,నెత్తిన పెట్టుకునే,వెర్రితనాన్ని వదిలి,నిజాయితీకే పట్టంకట్టే విజ్ఞతతో,ఓటేయగలిగినప్పుడు.ఫలానా నాయకుడి కొడుకని. అల్లుడని..మనవడని.మనవాడని నమ్మి,భ్రమించక,అభ్యర్థి చరితను..నడవడిని.._ ఒరవడిని చూసి,ఓటేయగలిగినప్పుడు.లక్షలు గాక లక్షణాలు చూసి,మందిబలం గాక,బుద్ధిబలం గమనించి వెనక గుండాలు గాక,మంచి గుండే ఉందోలేదో,ఆరాతీసి,ఓటేయగలిగినప్పుడు.చివరగా..నువ్వు నువ్వుగా.మంచిమనిషిగా. ఉత్తమ పౌరుడుగా,బాధ్యత గల ఓటరుగా, నిలబడి గర్వంగా,నీ హక్కును వినియోగించగలిగినప్పుడు.ఈ రౌడీల దగాకోరుల.నయవంచకుల.నేరచరితుల.వారసుల..కంసుల.అసురుల.బకాసురుల. కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యానికి,విముక్తి..దేశానికి ముక్తి.నీకు మరోసారి,దాస్యవిముక్తి.నిన్ను ఉద్ధరించడానికి ఎవరో రారు..నీ తరపున పోరాడరు.ఈసారి నువ్వే గాంధీవి.. నువ్వే నేతాజీవి. తిరగబడితేనే చరిత్రను తిరగరాయగలుగుతావు.. జాతీయ ఓటరు దినోత్సవo సందర్భoగా రాసిన ఒక యువకుడు....
Admin
Viswas Tv