విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : *కంచే చేను మేస్తే కాపలా కాసేవరెవరు..అన్న చందంగా తయారైంది. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం పరిస్థితి...* *కొంతమంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది చేతివాటం, నిర్లక్ష్య వైఖరి దోరణి కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది.* *యథేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపడున్నప్పటికీ, వాటి గురించి ఫిర్యాదులు అందుతున్నప్పటికీ అధికారులు అలసత్వం వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.* *కాసులకు కక్కుర్తిపడి టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా నిమ్మకునీరెత్తుతున్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.* *ఈ అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తూ జీవీయంసీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారనే ఆరోపణల వినిపిస్తున్నాయి.*
Admin
Viswas Tv