విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : Chandrababu - TDP: రోజంతా టీడీపీ నేతల బుజ్జగింపులతో చంద్రబాబు బిజీబిజి టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా వెలువడ్డాక.. టికెట్ ఆశించి భంగపాటుకు గురైన తెలుగుదేశం పార్టీ నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. ఈ మేరకు చంద్రబాబు రోజంతా (ఆదివారం) బిజీబిజీగా గడిపారు. నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడి సర్దిచెప్పారు. ఈ సందర్భంగా కొంతమంది నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. మరికొందరికి హామీలు ఇచ్చారు.
అమరావతి: టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితా వెలువడ్డాక.. టికెట్ ఆశించి భంగపాటుకు గురైన తెలుగుదేశం పార్టీ నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బుజ్జగించారు. ఈ మేరకు చంద్రబాబు రోజంతా (ఆదివారం) బిజీబిజీగా గడిపారు. నేతలతో వ్యక్తిగతంగా మాట్లాడి సర్దిచెప్పారు. ఈ సందర్భంగా కొంతమంది నేతలకు చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. మరికొందరికి హామీలు ఇచ్చారు. చంద్రబాబుని కలిసినవారిలో ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమ, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్న, ముక్కా రూపానంద రెడ్డి ఉన్నారు. గంటాకు చీపురుపల్లి నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీకి దాదాపు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక చంద్రబాబు నిర్ణయమే తనకు శిరోధార్యమంటూ నమస్కారం చేస్తూ దేవినేని ఉమమహేశ్వర రావు వెళ్లారు. ఇక చంద్రబాబుతో భేటీ అనంతరం ఆలపాటి రాజా, బొడ్డు వెంకట రమణ చౌదరి ఆసంతృప్తితో తిరిగి వెళ్లారు. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారని సమాచారం. రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుంటే ఆ స్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. ఇక టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు.. పీలా గోవిందును వెంటబెట్టుకొని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా పీలా గోవింద్ అసంతృప్తిగానే కనిపించారు. ఇక తనకు రాజంపేట టిక్కెట్ ఇవ్వాలని ముక్కా రూపానంద రెడ్డి టీడీపీ అధినేతను కోరినట్టు తెలుస్తోంది.అలాగే మాడుగుల నియాజకవర్గం సర్వ్ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే రామనాయడు అవకాసం కనబడుతుంది అని చంద్రబాబు నుండి అయ్యన్నపాత్రడుకి అదే విషయం చెప్పినట్టు తెలుసుతుంది
Admin
Viswas Tv