విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు జిల్లా : నెల్లూరు రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయంలో వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతోంది ? పార్టీ నుంచి వీడేందుకు సిద్ధమైనా, ప్రత్యర్దిపార్టీ నుంచి పోటీ చేస్తానని చెబుతున్నా, ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రభుత్వం ప్రతిష్ట మసకబారుస్తున్నా వైసీపీ ఏం చేయలేని నిస్సహాయ స్ధితిలో ఎందుకుంది ? దీని వెనుక ఉన్నదెవరు ? ఈ వివరాల్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ వెల్లడించారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి, తాజాగా అధిష్టానం అగ్రహానికి గురై తిరుగుబాటు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ పేరుతో చేసిన విమర్శలకు రాజకీయంగా మాత్రమే కౌంటర్లు ఇప్పించిన వైసీపీ.. ఇప్పుడు ఆయన కొనసాగిస్తున్న విమర్శల దాడి విషయంలో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది. కోటంరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు వైసీపీ దూకుడుగా ముందుకెళ్లడం లేదు. దీంతో వైసీపీ వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కోటంరెడ్డి ఎపిసోడ్ పై రఘురామ తనలాగే రెబల్ గా మారిన కోటంరెడ్డి వ్యవహారంలో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ స్పందించారు. వైసీపీతో విబేధిస్తున్న రఘురామకు మించి తనపై వేధింపులు ఉంటాయని తెలుసంటూ నిన్న కోటంరెడ్డి కూడా స్పందించిన నేపథ్యంలో రఘురామ రియాక్ట్ అయ్యారు. కోటంరెడ్డి వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్ధితిలోకి వెళుతోందన్న దానిపై రఘురామ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ప్రస్తుతం జగన్, కోటంరెడ్డి ఇద్దరి పరిస్ధితినీ రఘురామ విశ్లేషించారు.
[2/6, 22:22] Doctor: జగన్ దురదృష్టవంతుడు, కోటంరెడ్డి అదృష్టవంతుడు వైసీపీపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తిరుగుబాటు నేపథ్యంలో వైఎస్ జగన్ పరిస్ధితితో ఆయన పరిస్ధితిని రఘురామరాజు పోల్చారు. ఇందులో కోటంరెడ్డిని వదులుకున్న జగన్ దురదృష్టవంతుడని, కానీ జగన్ ను వదులుకుంటున్నందుకు కోటంరెడ్డి అదృష్టవంతుడని రఘురామరాజు వ్యాఖ్యానించారు. ఎవరో కొందరి చర్యల వల్ల కోటంరెడ్డి ఆత్మాభిమానం దెబ్బతినదంటూ రఘురామ వెల్లడించారు. శ్రీధర్ రెడ్డి తన మనోవేదన చెప్పుకున్నారని, ఆయనకు ప్రజా మద్దతు ఉంటుందని రెబెల్ ఎంపీ స్పష్టం చేసారు. కోటంరెడ్డిపై వేటు లేటుకు ఐదుగురే అడ్డంకి ? కోటంరెడ్డిపై ప్రస్తుతం వైసీపీ చర్యలు తీసుకోవాలనుకుంటే పార్టీ నుంచి బహిష్కరించడం మినహా మరో మార్గం లేదన్నారు. అలా కాకుండా అనర్హత వేటు వేస్తే మాత్రం ఇప్పటికే పార్టీలు ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేలపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అందుకే కోటంరెడ్డిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని రఘురామ తెలిపారు. కోటంరెడ్డిపై పార్టీ పరంగా వేటు వేస్తే ఆయన అధికారికంగా టీడీపీలో చేరిపోయే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో రఘురామ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Admin
Viswas Tv