Saturday, 13 June 2026 10:06:07 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

Rajaputra Rajani వైస్సార్సీపీ బీసీ నేత : రసపుత్ర రజనీని సాగనంపిన జగన్ సర్కార్..మొన్నే జీవో జారీ..

Date : 28 January 2023 07:48 AM Views : 979

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కడప జిల్లా : ఏపీలో బీసీ కార్పోరేషన్ డైరెక్టర్ పదవిలో ఉంటూ కర్నాటకలో నకిలీ నోట్ల చెలామణీ వ్యవహారంలో అరెస్ట్ అయిన వైసీపీ మహిళా నేత రసపుత్ర రజనీని ఆ పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం ఇవాళ జీవో జారీ చేసింది.ఏపీ బొందిలి కార్పోరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజిని తాజాగా నకిలీ నోట్ల చలామణి కేసులో దొరికిపోయారు. కర్నాటకలో నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఆమెతో పాటు చరణ్‌సింగ్‌ అనే మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి పోలీసులు రూ.44 లక్షల విలువగల రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏపీ ప్రభుత్వంలో కలకలం రేపింది.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రసపుత్ర రజనీ వైసీపీలో యాక్టివ్ గా ఉండే మహిళా నేతగా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆమెను ఈ బీసీ కార్పోరేషన్ (బొందిలి) డైరెక్టర్ పదవికి ప్రభుత్వం గతంలో నియమించింది. అయితే తాజాగా కర్నాటక పోలీసులు ఆమెను నకిలీ నోట్ల కేసులో అరెస్టు చేయడంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఈ వ్యవహారంలో ఆమె తప్పున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని వైసీపీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి ప్రకటించారు. దీంతో ఆమెపై చర్యలు తప్పవని తేలిపోయింది. ఇవాళ రజనీని తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బీసీ సంక్షేమ శాఖ రెండు రోజుల క్రితమే బొందిలి కార్పోరేషన్ డైరెక్టర్ పదవి నుంచి రసపుత్ర రజనీని తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులు ఇవాళ వెలుగుచూశాయి. ఇందులో కర్నాటకలోని బెంగళూరు నగరంలో ఉన్న సుబ్రమణ్యపుర పోలీసు స్టేషన్లో నకిలీ నోట్ల కేసు ఆమెపై నమోదు కావడంతో ఆమెను తప్పిస్తున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం ఏపీ బొందిలి కార్పోరేషన్ లో నాన్ అఫిషియల్ డైరెక్టర్ గా ఉన్న రజనీ నియామకాన్ని నిలుపుదల చేయడంతో పాటు ఆమెను పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :