Saturday, 13 June 2026 10:13:35 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

రాశిఫలాలు 18.3. 2024... విశ్వాస్ టీవీ న్యూస్ లో చుసిద్ధాము రండి

Date : 18 March 2024 07:41 AM Views : 2070

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : viswastv.com మేషం ;- ఈ రోజు సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. viswastv.com వృషభం ;-ఈ రోజు ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. viswastv.com మిధునం ;- ఈ రోజు పాత బుణాలు తీరి ఊరట పొందుతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Viswastv.com కర్కాటకం ;-ఈ రోజు దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. ఆదాయం అంతగా ఉండదు. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Viswastv.com# సింహం ;- ఈ రోజు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Viswastv.com# కన్య ;- ఈ రోజు ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చుట్టుపక్కల వారితో ఊహించని విభేదాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Viswastv.com# తుల;- ఈ రోజు కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Viswastv.com వృశ్చికం ;-ఈ రోజు స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. గోచార రిత్య అర్ధాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Viswastv.com#ధనస్సు ;-ఈ రోజు వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Viswastv.com#మకరం ;-ఈ రోజు ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Viswastv.com#కుంభం ;-ఈ రోజు ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పాత ఋణాలు తీరుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యాపారము భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. Viswastv.Com# మీనం ;-ఈ రోజు నూతన వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గోచార రిత్య ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :