విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా :
విశాఖపట్నం విశ్వాస్ టీవీ IPL Auction 2023: నిన్న (డిసెంబర్ 23) ఐపీఎల్ మినీ వేలం జరిగింది. ఇందులో కొంతమంది అంతర్జాతీయ ఆటగాళ్లు కోట్లు పలికారు. అలాగే దేశావాళీలో రాణించిన కుర్రాళ్లను కొన్ని ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ ఆటగాడు షేక్ రషీద్ ఉన్నాడు. అతడిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ షేక రహీద్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శుక్రవారం జరిగిన మినీ వేలంలో ఇతడిని సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2022 లో రషీద్ అద్భుతంగా రాణించాడు. ఈ లీగ్ లో రాయలసీమ కింగ్స్ తరఫున ఆడిన రషీద్ 159 పరుగులు చేశాడు. అలాగే 2022లో అండర్-19 ప్రపంచకప్ గెలుచుకున్న యువ జట్టుకు రషీద్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అప్పుడే రషీద్ ఐపీఎల్ కు వస్తాడని భావించినా.. కొన్ని కారణాల వల్ల అతడితో పాటు పలువురు అండర్- 19 ఆటగాళ్లు ఈ లీగ్ లోకి రాలేకపోయారు. ఇప్పుడు మాత్రం రషీద్ న చెన్నై దక్కించుకుంది. ఏకంగా భారత మాజీ కెప్టెన్ నేతృత్వంలో ఐపీఎల్ ఆడబోతున్నాడు రషీద్. దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఈ యువ క్రికెటర్ కెరీర్ కు కచ్చితంగా దోహదపడుతుంది. రషీద్ గురించి మరికొంత 18 ఏళ్ల రషీద్ తొమ్మిదేళ్లకో అండర్ - 14 క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. అండర్- 19 ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ లో 50 పరుగులు చేశాడు. జట్టు కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. మొత్తం ఆ టోర్నీలో 201 పరుగులు సాధించాడు. ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ రషీద్ అరంగేట్రం చేశాడు.
Admin
Viswas Tv