Thursday, 30 July 2026 07:43:57 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

మందుల ఏజెన్సీల పై డ్రగ్ అధికారులు దాడులు భారీగా పట్టుబడిన మత్తు మందులు....

Date : 13 February 2023 10:31 AM Views : 1089

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / పశ్చిమగోదావరి జిల్లా : తణుకులో మందుల ఏజెన్సీలపై కేసులు.. రూ.8.10 లక్షల సరకు స్వాధీనం.... మెడికల్‌ ఏజెన్సీలో తనిఖీలు చేస్తున్న అధికారులు..... వైద్యలు సూచనల మేరకు మాత్రమే వినియోగించాల్సిన ఔషధాలను అనధికారికంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులపై ఔషధ నియంత్రణ అధికారులు కేసులు నమోదు చేసి, రూ.8.10 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు భీమవరం, తణుకు ఔషధ నియంత్రణ అధికారులు పి.మల్లికార్జునరావు, షేక్‌ అబిద్‌ అలీ, సిబ్బంది శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు పట్టణంలోని మెడికల్‌ ఏజెన్సీలపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. స్థానిక వెంకటసాయి మెడికల్‌ ఏజెన్సీ యజమాని వరప్రసాద్‌ వయాగ్రా, నిద్ర మాత్రలు, అబార్షన్‌ కిట్లు అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అతడి నుంచి రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక మాత్రల అట్టలపై ఉన్న ధరలను చెరిపివేసి అధిక ధరలకు విక్రయించడంపైనా కేసు నమోదు చేశారు. దొడ్డిపట్లవారి వీధిలోని లక్ష్మీపవన్‌ మెడికల్‌ ఏజెన్సీ నిర్వాహకుడు ఉప్పల సోమనాగేశ్వర శ్రీనివాస్‌ ఓ కిరాణా దుకాణంలో మందులను నిల్వ ఉంచి ఆర్‌ఎంపీలకు అమ్ముతున్నట్లు గుర్తించి, రూ.60 వేలు విలువైన మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. ఇతడికి తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన కాపకాయల శ్రీనివాస్‌ సరఫరా చేస్తున్నట్లు తేలడంతో వెంకట్రాయపురం రైల్వే గేటు సమీపంలో ఉన్న గోదాములో తనిఖీలు నిర్వహించి సుమారు రూ.5.50 లక్షల విలువైన అబార్షన్‌ కిట్లు, మందులు స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా మత్తు మాత్రలు తీసుకొచ్చి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మెడికల్‌ ఏజెన్సీలు, రిటైల్‌ దుకాణాలు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలకు విక్రయిస్తున్నారని అధికారి అబిద్‌ అలీ తెలిపారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: