Wednesday, 19 November 2025 07:05:24 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

విశాఖ స్థానిక పోలీస్ ల పై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి ఫిర్యాదు చేసిన తల్లితండ్రులు.....

Date : 22 August 2023 09:57 PM Views : 3134

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖ నరసింహ నగర్ లోని సాధనా హాస్టల్ లో గత నెల 14 వ తేదీన బెంగాల్ కు చెందిన ఇంటర్ విద్యార్దిని రితీ సాహా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే అది హత్య గా విద్యార్దిని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు డబ్బులు తీసుకుని ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ తల్లితండ్రులు ఏకంగా బెంగాల్ సీఎం కు ఫిర్యాదు చేశారు..దీంతో బెంగాల్ లోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయించిన బెంగాల్ ముఖ్యమంత్రి విచారణ కోసం ఒక టీమ్ ను విశాఖ పంపిస్తున్నారు. అయితే దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిన సంబంధిత విశాఖ నాల్గవ పట్టణ పోలీసులు అక్కడకు వెళ్లిన మీడియా ను నియంత్రించే ప్రయత్నం చేస్తుండడం మరింత అనుమానాలకు తావిస్తోంది. వైద్య విద్య కోసం వచ్చి విగత జీవిగా.. బెంగాల్ కు చెందిన రితీ సాహా ఆకాష్ బైజూస్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆకాష్ బైజూస్ కు అనుసంధానంగా ఉన్న సాధనా హాస్టల్ లో రితీ సాహా ఉంటోంది. బైజూస్ యాజమాన్యం ఆ హాస్టల్ ను ఔట్ సోర్సింగ్ చేసి నిర్వహిస్తోంది. గత నెల 14న హాస్టల్ 4 వ అంతస్తు పై నుంచి దూకి చనిపోయిందని తల్లితండ్రులకు హాస్టల్ యాజమాన్యం తెలిపింది. హుటాహుటిన బెంగాల్ నుంచి వచ్చిన తల్లి తండ్రులకు హాస్టల్ సిబ్బంది, పోలీసులు చెప్తున్న దానిపై అనేక అనుమానాలు వచ్చాయి. నాలుగో అంతస్తు పైకి వెళ్ళే సమయంలో ఒక డ్రెస్ లో ఉన్నట్టు హాస్టల్ సీ సీ పుటేజ్ లో కనిపించింది. కానీ, కింద పడి ఉన్న మృత దేహం పై మరో కలర్ డ్రెస్ ఉన్నట్టు ఆ భవనానికి ఎదురుగా ఉన్న బిల్డింగ్ సీ సీ ఫోటేజ్ లో ఉన్నట్టు మృతు రాలి తల్లి తండ్రులు చెప్తున్నారు. ఆ విషయాన్ని పోలీసులకు చెబితే పట్టించుకోవడం లేదనీ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ ల పై నమ్మకం లేదంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కి ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు. కలకత్తా లో ఈ హత్య కేసుపై మమతా బెనర్జీ మాట్లాడారు. బెంగాల్ మంత్రి అనూప్ ను ఏకంగా రితీ సాహా ఇంటికి పంపించారు. విశాఖ లో జరిగిన వ్యవహారం పై కోల్ కత్తా లో కేసు నమోదు.. పోలీసులపై అనుమానాలు.. కోల్ కత్తా నేతాజీ నగర్ పీ ఎస్ లో రితీ సాహా అనుమానస్పద మృతిపై కేసు నమోదు కావడం పై విశాఖ పోలీస్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. స్థానిక పోలీస్ అధికారుల వ్యవహార శైలి పై మృతురాలి తల్లితండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. మేము అక్కడ ఉన్నప్పుడు ఒక నల్లటి కార్ లో వచ్చిన వ్యక్తులకు బ్యాగ్‌లలో డబ్బులు పంపారని, వాళ్ళు పోలీస్ అధికారులకు చెందిన మనుషులు అని తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో జరిగిన ఘటనలపై వేరే రాష్ట్రంలో కేసులు నమోదు కావడం అరుదు..అలాంటిది కలకత్తా లో కేసు నమోదు కావడం, ఇక్కడ స్థానిక పోలీసుల పై ఆరోపణలు రావడం లాంటి పరిణామాల పై విస్తృత చర్చే సాగుతోంది. ఈ వ్యవహారంలో పోలీస్ ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరోపణలు రావడం గమనార్హం. విచారణ సాగుతోంది: డీసీపీ విద్యాసాగర్ రితీ సాహా మృతి పై అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశాం. ఫోరెన్సిక్ నివేదిక అందాల్సి ఉంది. ఆ నివేదిక ను బట్టి తదుపరి విచారణ ఉంటుందన్నారు విశాఖ డీసీపీ విద్యాసాగర్ నాయుడు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :