Thursday, 30 July 2026 07:39:30 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

టీడీపీ లోకి, వైస్సార్సీపీ ఎమ్మెల్యే లు ఎవరు అంటే,.....

Date : 05 January 2023 10:54 PM Views : 1163

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు జిల్లా : ఏపీలో రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం సంక్రాంతి బరిలో కోడిపుంజుల్లా తలపడుతున్నాయి. కచ్చితంగా రెండోసారి అధికారం చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి జగన్, ఈసారి అధికారంలోకి రావాల్సిందేననే లక్ష్యంతో చంద్రబాబు తమ ఎన్నికల ప్రణాళికలను అమలు చేస్తున్నారు.

ఆనం ధిక్కార స్వరం ఇటీవలి కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రభుత్వ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయన కుమార్తె కైవల్యారెడ్డి ఒంగోలు మహానాడు సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేతలను కలిసింది. ఆత్మకూరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేయడానికి టికెట్ అడగటానికే కలిసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై అప్పట్లోనే ఆనం స్పందించారు. తమ కుమార్తె వివాహం చేసుకున్న కుటుంబమంతా టీడీపీ నాయకులవడంతో ఆ నిర్ణయం తీసుకున్నారని, అది ఆమె వ్యక్తిగత నిర్ణయమని

ప్రాధాన్యత దక్కడంలేదని కినుక సీనియర్ రాజకీయవేత్తగా పార్టీలో తనకు అనుకున్నంత ప్రాధాన్యత దక్కకపోవడంతో కొన్నాళ్ల నుంచి ఆయన కినుక వహించారు. ప్రభుత్వంపైనే నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని నియమించారు. దీంతో రానున్న ఎన్నికల్లో దాదాపుగా ఆనంకు సీటు దక్కడం అనుమానేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేయడానికి ఆనం అన్నిరకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారని, అందుకే నేరుగా పార్టీపై విమర్శలు సంధిస్తున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. జగన్ చేత పార్టీ నుంచి బయటకు పంపించేసుకొని సానుభూతి పొందడానికే ఆనం ప్రయత్నిస్తున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.వసంత కృష్ణప్రసాద్ సంగతి..? కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు, మంత్రి జోగి రమేష్ కు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎన్నారైలను భయపెడితే సేవా కార్యక్రమాలు చేయడానికి ఎవరూ ముందుకు రారంటూ ఉయ్యూరు శ్రీనివాసరావు విషయంలో టీడీపీకి మద్దతుగా మాట్లాడారు. చంద్రబాబుపై ఏనాడూ విమర్శలు చేయనని గతంలోనే ప్రకటించారు. వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు, ఆయన వైఖరి టీడీపీలోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఉంటున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా వైసీపీ మాజీ మంత్రి మేకతోటి సుచరిత.. ''తన భర్త పార్టీ మారుతున్నాను.. నువ్వు కూడా రా.. అంటే వెళ్లక తప్పదుకదా'' అని వ్యాఖ్యానించారు. దయాసాగర్ చేరే పార్టీలోనే సుచరిత కూడా చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ఒక స్పష్టత వచ్చింది. ఆనం రామానారాయణరెడ్డి, వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మేకతోటి దయాసాగర్ జనసేనలో చేరే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనప్పటికీ వీటిపై ఒక స్పష్టత రావాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు..........

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: