విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : కలాం గారు జీవించి ఉంటే ఎంత సంతోషించే వారో! చంద్రయాన్ 3ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు పాదాభివందనం.విశ్వాస్ టీవీ .....అగ్రరాజ్యాల అంతరిక్ష పరిశోధన సంస్థలు తమ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలతో ప్రస్తుతం ఇస్రో ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారు. జీతం కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్న నిజమైన దేశభక్తులు మన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇతర ఉద్యోగులు. ఒక జాతి మొత్తం గర్వించే సందర్భాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకేనా మన దేశంలో క్రికెట్ లో పాకిస్తాన్ మీద గెలవడమే జాతి గర్వించే అతి పెద్ద ఈవెంట్. క్రమేణా ఈ పరిస్థితి మారుతోంది. క్రికెట్ కాకుండా ఇతర క్రీడలలో కూడా మనవాళ్ళు ఛాంపియన్స్ గా అవతరిస్తున్నారు. శాస్త్రసాంకేతిక రంగాల్లో అయితే, జాతి గర్వించే విజయాలు చాలా తక్కువ. ఇస్రో సాధించిన ఈ ఘనతకు మన మీడియా అద్భుతమైన కవరేజ్ ఇచ్చింది. సాధారణ గృహిణులకి కూడా చంద్రయాన్ పై ఆసక్తి కలిగించడంలో, చివరి 17 నిమిషాలకు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ అంత హైప్ తీసుకురావడంలో మీడియా సక్సెస్ అయింది. ఇలాంటి శాస్త్ర సాంకేతిక అంశాలకు మీడియాలో ప్రాధాన్యత దక్కితే, అది మరెంతోమంది విద్యార్థుల వైపు ఆకర్షింపబడేలా చేస్తుంది. ఇది దేశానికి ఎంతో మంచిది. కలాం గారు జీవించి ఉంటే మీడియా ఈరోజు పోషించిన పాత్రని చూసి ఎంత సంతోషించేవారో...
Admin
Viswas Tv