Friday, 16 January 2026 03:57:09 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

విశాఖలో ఇంటికి అతి త్వరలో గృహప్రవేశం, ముస్తాబు అవుతున్న వైస్సార్సీపీ అదినేత....

Date : 07 February 2023 11:24 AM Views : 966

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ముఖ్యమంత్రి జగన్ విశాఖకు షిఫ్ట్ అయ్యేందుకు కసరత్తు మొదలైంది. విశాఖ కేంద్రంగా సీఎం తన పాలనా వ్యవహారాలు పర్యవేక్షించేందుకు సిద్దమవుతున్నారు. మూడు రాజధానుల వివాదం కోర్టులో స్పష్టత వచ్చిన తరువాత రాజధానుల అంశం పైన ప్రభుత్వం తదుపరి కార్యాచరణ ఖరారు చేయనుంది. సుప్రీం కోర్టులో ఈ నెల 23న మూడు రాజధానుల కేసు విచారణకు రానుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి గా రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా పాలన సాగించే అవకాశం ఉండటంతో.. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు కసరత్తు సాగుతోంది. ఇందుకోసం విశాఖలోని బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కోసం ఇంటిని ఖరారు చేసినట్లు సమాచారం. ఇందుకు గృహ ప్రవేశం ముహూర్తం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది.

విశాఖలో సీఎం ఇంటి గృహ ప్రవేశం.. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత మూడు రాజధానుల ప్రకటన చేసారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. ఈ నిర్ణయం పైన అమరావతి రైతులు..జేఏసీ హైకోర్టును ఆశ్రయించగా .. హైకోర్టు అమరావతి రాజధానిగా కొనసాగాలని ఆదేశించింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లింది. ప్రస్తుతం ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ ఉంది. ఏపీ ప్రభుత్వ వినితితో ఈ నెల 23న సుప్రీంకోర్టులో మూడు రాజధానుల కేసు విచారణ చేపట్టనుంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ సీఎంగా తాను రాష్ట్రంలో ఎక్కడి నుండి అయినా పాలన చేసే అవకాశం ఉండటంతో.. విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకొని..అక్కడ నుంచి పాలన చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం విశాఖలోని బీచ్ రోడ్డులో భవనం గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న కోర్టు తీర్పు మూడు రాజధానులకు అనుగుణంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

ముహూర్తం ఖరారు.. ద్విముఖ వ్యూహం విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయానికి ఉగాది నాడు మార్చి 22 గృహ ప్రవేశం ముహూర్తంగా ఖరారు చేసినట్లు సమాచారం. ముందుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రారంభించి అక్కడి నుంచే సమీక్షలు పాలనా వ్యవహారాలు నిర్వహించనున్నారు. కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే రానున్న విద్యా సంవత్సరానికి ముందే సచివాలయం తరలింపుకు సంబంధించి ముందుగా భవనాలు గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా సచివాలయం తరలింపు పైన నిర్ణయం తీసుకోనున్నారు. కోర్టు తుది తీర్పు ఆలస్యం అయితే, మార్చి 22 నుంచి విశాఖ కేంద్రంగా ముఖ్యమంత్రి తన కార్యకలాపాలు ప్రారంభించటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే స్వయంగా ముఖ్యమంత్రి ఢిల్లీ కేంద్రంగా జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్ సన్నాహక సదస్సులో విశాఖే ఏపీ రాజధాని అని.. తాను త్వరలో విశాఖకు మారుతున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.రాజకీయంగానూ విశాఖ కేంద్రంగా విశాఖ కేంద్రంగానే ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. మూడు రాజధానుల పైన సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తే..మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టి.. మార్చి 22న ముందుగా సీఎం కార్యాలయం..ఆ తరువాత క్రమేణా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు దిశగా ఆలోచన సాగుతోంది. ప్రతిపక్షాలు మాత్రం అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ధీమాగా చెబుతున్నారు. సీఎం విశాఖలో క్యాంపు కార్యాలయం ద్వారా పాలన ప్రారంభించినా.. కోర్టు తీర్పు తరువాతనే అధికారికంగా రాజధాని మార్పు పైన నిర్ణయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో.. ఈ నెల 23న సుప్రీంలో జరిగే మూడు రాజధానుల కేసు విచారణ కీలకం కానుంది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :