Wednesday, 19 November 2025 07:12:56 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

కానిస్టేబుల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్, సంచలన విషయాలు బయట పెట్టిన పైడిమ్మ....

Date : 06 August 2023 08:30 PM Views : 3294

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖపట్నంలో కానిస్టేబుల్‌ రమేష్‌ హత్య.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రియుడి మోజులో పడి మూడుముళ్లు వేసిన భర్తనే.. ఆ కసాయి భార్య కడతేర్చింది. ఆపై ఏం తెలియనట్లు.. తన భర్త గుండెనొప్పితో మృతి చెందాడంటూ పోలీసులను నమ్మించింది రమేష్‌ భార్య శివాని. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు తెలిశాయి. ప్రియుడి కోసం తన దగ్గర ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ భర్త హత్యకు సుపారీ ఇచ్చింది శివాని. ఈ ఘటనకు సంబంధించి శివాని అక్క పైడమ్మ సంచలన నిజాలు చెప్పింది. రమేష్ అనే వ్యక్తి విశాఖపట్నంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడి భార్య శివాని, ఇద్దరు కుమార్తెలతో కలిసి నగరంలోనే నివాసం ఉంటున్నాడు. ఇక శివాని.. ఎదురింట్లో ఉండే రామారావు అనే ఆటో డ్రైవర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడి మోజులో పడి భర్తను అత్యంత దారుణంగా హత్య చేసింది. పక్కా పథకం ప్రకారం భర్తను హత్య చేయించింది. ముందుగా అతడి చేత పూటుగా మద్యం తాగించి.. ఆ తర్వాత అతడు మత్తులోకి వెళ్లాక.. రమేష్‌ ముఖం మీద దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

తన భర్తను హత్య చేసేటప్పుడు శివాని అక్కడే ఉండటమే కాక.. తానే తన రమేష్‌ కాళ్లు కదలకుండా పట్టుకుంది. రమేష్‌ హత్యకు పాల్పడిన వారిలో శివాని, ప్రియుడు రామారావు, నీలా అనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో శివాని అక్క పైడమ్మ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి పైడమ్మ పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. శివాని, రమేష్ బాగానే ఉండేవారని తెలిపింది. రమేశ్ దంపతులపై చిన్న ఆరోపణ ఉందని తెలిపింది. ఆ విషయంలో రమేశే దంపతులకు తాను అండగా ఉన్నాని పైడమ్మ తెలిపింది. అంతేకాక రామారావుతో ఎప్పటి నుంచి శివానికి పరిచయం ఉందో తనకు తెలియదన్నారు. “ఓ సారి శివాని, రామారావుతో కనిపించినటప్పుడు.. నేను అడగ్గా.. మాకు తెలిసినవారేనని చెప్పింది. రమేశ్ కి కూడ రామారానవు బాగా తెలుసని శివాని తెలిపింది. నాకు ఫోన్ చేసిన ప్రతిసారి.. కాల్ ను హోల్డ్ లో పెట్టి వేరే వాళ్లతో మాట్లాడేది. రమేశ్ చనిపోయిన రోజు కూడా.. ఆయన ఇంకా నిద్రపోతున్నాడు అక్క అంటూ శివాని ఫోన్ చేసింది. రమేశ్ హత్యలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే శివానితో మాట్లాడటమే నేను చేసిన తప్పులా ఉంది. ఇప్పుడు శివాని.. నా పేరు చెప్పడం ఆశ్చర్యంగా ఉంది” అంటూ శివాని అక్క పైడమ్మ పలు విషయాలను వెల్లడించింది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :