విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశ్వాస్ టీవీ విశాఖ :దేశంలో ఆందోళన రేకిత్తిస్తున్న ఒమిక్రాన్ విశాఖలోనూ అడుగు పెట్టింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కేసులు నమోదు కాగా తాజాగా తూర్పుగోదావరి, విశాఖలోనూ చెరొకటి నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం నాలుగు కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. మొత్తం 53మంది అంతర్జాతీయ ప్రయాణికులు రాగా, వారిలో 9మందికి కోవిడ్`19లో ఆర్‌టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ తేలిందని అధికారులు తెలిపారు. అయితే కోవిడ్ నిబంధనలు పాటించి అంతా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. పుకార్లను నమ్మవద్దంటూ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ విడుదల చేసిన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ` తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 41ఏళ్ల మహిళ కువైట్ నుంచి ఈ నెల 19న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. 20న ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌లో పాజిటివ్ నిర్థారణైంది. దీంతో సీసీఎంబీలోని జినోమ్ సీక్వెన్సింగ్‌కు శ్యాంపిల్‌ను పంపించగా నెల 23న ఒమిక్రాన్ తేలిందని వైద్యాధికారులు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో సదరు మహిళను క్వారంటైన్‌లో ఉంచారు. ` విశాఖ ప్రాంతానికి చెందిన 33ఏళ్ల వ్యక్తి దుబాయ్ (యూఏఈ) వెళ్లి ఈనెల 15న తిరిగొచ్చారు. చిన్నగా జ్వరం రావడంతో ఆయన్ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. 16న ఆర్‌టీపీసీఆర్ టెస్టులో పాజిటివ్ రాగా, శ్యాంపిల్‌ను సీసీఎంబీకి పంపగా 23న ఒమిక్రాన్‌గా నిర్థారణ అయ్యింది. వాస్తవానికి ఆయన ఈనెల 22నే ఆయన డిశ్చార్జి కాగా, వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Admin
Viswas Tv