Wednesday, 19 November 2025 07:06:51 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

భర్తను ఊపిరి ఆడకుండా చేసి, చంపేసి, హార్ట్ అట్టాక్ తో చనిపోయాడు అని నమ్మిoచి పిల్లలును అనాదులు చేసిన కసాయి తల్లి....

Date : 04 August 2023 06:55 PM Views : 3335

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : ఇద్దరు పిల్లలు.. సాఫీగా సాగుతున్న కాపురంలో వివాహేతర బంధం చిచ్చు పెట్టింది. ఇద్దరి మధ్య మాట, మాట పెరిగింది. నువ్వు నాతో లేకపోయినా పర్వాలేదు.. వాడితో సుఖంగా ఉండు అని ఆమెకు భర్త చెప్పాడు. అయితే పిల్లలు నాకు ఇవ్వు నేను బాయ్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళిపోతాను అని భార్య చెప్పింది. నీతో పిల్లల్ని పంపిస్తే వాళ్ల భవిష్యత్తు ఉండదు నాతోనే ఉంచుకుంటా.. అని భర్త చెప్పాడు. ఇక అనుకున్నది జరగడం లేదు.. కలహాలు మొదలయ్యాయి.. అడ్డుగా ఉన్నాడు. ఇక బాయ్ ఫ్రెండ్ తో విషయాన్ని చెప్పింది. ఓ ఫైన్ డేస్ స్కెచ్ వేసింది. ప్రియుడితో కలిసి భర్త ఊపిరి తీసి ఏమీ ఎరగనట్టు ఉండిపోయింది. సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్ అయింది. ఇది విశాఖలో.. ఓ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి వెనుక ఉన్న భార్య క్రైమ్ స్కెచ్..! విశాఖ వన్ టౌన్ లో కానిస్టేబుల్ రమేష్ అసిస్టెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. ఇంట్లో రాత్రి పడుకుని తెల్లారేసరికి శవంగా మారాడు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. మృతి వెనుక మిస్టరీ వీడింది. హత్యగా నిర్ధారించారు పోలీసులు. ప్రియుడు సహకారంతో భర్తను హత్య చేసింది కానిస్టేబుల్ భార్య. కానిస్టేబుల్ భార్య శివజ్యోతి, టాక్సీ డ్రైవర్ రామారావు, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర బంధమే హత్యకు కారణంగా తెలింది. ఊపిరాడకుండా చేసి కానిస్టేబుల్ రమేష్ హత్య చేశారు. ఆపై సాధారణ మరణంగా చిత్రించే ప్రయత్నం చేశారు. వీడియోను చిత్రీకరించి.. అలా నమ్మించి.. – డ్యూటీ నుంచి తిరిగి ఇంటికి వెళ్లిన కానిస్టేబుల్ రమేష్…రాత్రి పడుకొని మరుసటి రోజు ఉదయం తిరిగి లేవలేదు. ప్రాణాలు కోల్పోయాడు. విగత జీవిగా మారాడు. రాత్రి పడుకుని తెల్లారేసరికి లేవలేదని భార్య చెబుతూ వచ్చింది. బంధువులకు ఇదే విషయాన్ని కాల్ చేసి చెప్పింది. అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. ఏడుపు మొదలు పెట్టింది. కానీ ఎక్కడో చిన్న అనుమానం. ఎందుకంటే ఇద్దరి మధ్య గత కొన్ని వాగ్వాదాలు జరుగుతున్నాయి. దానికి తోడు పూటుగా మద్యం సేవిస్తున్నట్టు భార్య వీడియోను చిత్రీకరించింది. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. అనుమానాలపై కూపీ లాగిన పోలీసులకూ ఆధారాలు దొరికాయి. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నించినందుకే భర్తను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఊపిరి ఆడకుండా కానిస్టేబుల్ రమేష్ ప్రాణాలకు కోల్పోయినట్టు ప్రాథమిక నివేదిక రావడంతో.. కానిస్టేబుల్ రమేష్ ది హత్యగానే పోలీసులు నిర్ధారించారు. వెళ్ళిపోమన్నా ఉసురుతీసింది… – వివాహేతర సంబంధం తెలిసి.. రమేష్ భార్యను ప్రియుడితో వెళ్లిపోమన్నాడు. ఎన్నిసార్లు తనకు చెప్పినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఇక గుండెను రాయి చేసుకున్నాడు రమేష్. నువ్వు నాతో ఉండకు వాడితో వెళ్ళిపో.. అని భార్యకు సూచించాడు రమేష్. అయితే తాను పిల్లలను తీసుకు వెళ్లిపోతానని చెప్పుకొచ్చింది భార్య. పిల్లలు వదిలి వెళ్లాలని రమేష్ చెప్పడంతో.. అడ్డొస్తున్నాడని హత్యకు ప్లాన్ చేసింది శివ జ్యోతి. గిలగిలా కొట్టుకుంటుంటే కదలకుండా కాళ్లు పట్టుకుంది.. – భర్త తనకు ఇబ్బందిగా మారాడని.. అడ్డు తొలగించాలని ప్లాన్ చేసిన భార్య శివాని.. ప్రియుడికి చెప్పడంతో.. ప్రియుడు తనకు తెలిసినవాడైన నీలాను పురమాయించాడు. అందుకు లక్ష రూపాయలకు ఇచ్చినట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్య జరిగిన సమయంలో భార్య శివజ్యోతి కానిస్టేబుల్ కాళ్లు పట్టుకోగా.. ప్రియుడు పురమాయించిన మూడో వ్యక్తి నీలా.. కానిస్టేబుల్ ముఖంపై తలగడ అదిమి ఊపిరి తీశాడు. ప్రియుడు రామారావు ఇంటి బయట కాపలా కాశాడు. ఊపిరితిశాక ఎవరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. శివ జ్యోతి ఉదయం నుంచి డ్రామా మొదలు పెట్టేసింది. బెనిఫిట్స్ అన్ని కొట్టేయాలని ప్లాన్.. – అయితే సాధారణ మరణంగా చిత్రీకరించి రామారావుకు ప్రభుత్వం నుంచి అందే బెనిఫిట్స్ పూర్తిగా కొట్టేయాలని ప్లాన్ చేసింది భార్య. ఇదే విషయాన్ని చెప్పారు సిపి త్రివిక్రమ్ వర్మ. ఎందుకంటే.. ముందు హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఆ తర్వాత హత్య చేయించింది. ఎవరి దారిన వాళ్లకు వెళ్లిపోమని చెప్పి సలహా ఇచ్చింది. తెల్లారేసరికి డ్రామా ఆడింది. గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని క్రియేట్ చేసింది. ఎందుకంటే పూటుగా మద్యం సేవించినట్టు చెప్పుకొచ్చింది. ఓ వీడియో షూట్ చేసి మరీ చూపించింది. అంత క్రియేటివిటీ చేసినా చివరకు ఆమె మర్డర్ స్ట్రాటజీ బయటపడక తప్పలేదు. తొలుత నమ్మారు.. కానీ… – భార్య బాధలో ఉన్నాడని బంధువులందరికీ తెలుసు. అదే అతన్ని కృంగదీసి చివరకు ప్రాణాలు కోల్పోయేలా చేసిందని బంధువులు అనుకున్నారు. ఎందుకంటే అటువంటి డ్రామా క్రియేట్ చేసింది భార్య శివాని. కానీ.. ఎక్కడో చిన్న అనుమానం. ఎందుకంటే రమేష్ కు ఆత్మహత్య చేసుకునే అంత పెరికి వాడు కాదు. అనారోగ్య సమస్యలు కూడా లేవు. మరి ఎలా ప్రాణాలకు కోల్పోయి ఉంటాడు..? బంధువులు ముందుగానే అనుమానించారు.. కానిస్టేబుల్ రమేష్ మృతి సాధారణ మరణం కాదని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాలు నిజమయ్యాయి. శివానితో పాటు ఆమె ప్రియుడు సహకరించిన మరో వ్యక్తిని కటకటాల్లోని నెట్టారు పోలీసులు. ఆమె వ్యామోహం ఇద్దరు పిల్లలను అనాథలు చేసింది.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :