విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / నెల్లూరు జిల్లా : అమరావతి : _*కందుకూరులో చంద్రబాబు గారి సభలో అపశ్రుతి చోటు చేసుకుంది.!*_ కందుకూరులో వేల మంది ప్రజలు, కార్యకర్తలు తరిలివచ్చారు. సభా ప్రాంగణంలో ప్రజలు పోతెట్టటంతో, కార్యకర్తల తోపులాటలో ఒక్కసారిగా పెద్ద కాలవలో సుమారు పది మంది కార్యకర్తలు పడి పోయారు. ఆ కాలువ ప్రభుత్వ నిర్వహణ సరిగా లేక, ఓపెన్ గా ఉండటం, సెంటర్ లోనే అలా ఉంటుందని ఊహించక పోవటంతో, అందులో పడిపోయారు. దీంతో చంద్రబాబు గారు తన ప్రసంగం ఆపేసారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. ఆయన కాన్వాయ్ లో అంబులెన్సు ఇచ్చి పంపించారు. అంతే కాకుండా, వారి యోగక్షేమాలు తెలుసుకోవటానికి, చంద్రబాబు నేరుగా హాస్పిటల్ కు వెళ్లారు, అక్కడే ఉండి పరిస్థితి సమీక్షించారు. చనిపోయిన కుటుంబాలకు పార్టీ తరుపున రూ.10 లక్షలు ప్రకటించారు. అలాగే గాయపడిన వారిని ఆదుకుంటామని, వారి పిల్లలని ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్ లో చదివిస్తామని హామీ ఇచ్చారు. సభా ప్రాంగణంలో వారికి నివాళులు అర్పించి, మీటింగ్ రద్దు చేసారు.*
Admin
Viswas Tv