విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి జిల్లా :
తిరుమల విశ్వాస్ టీవీ : శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఆన్ లైన్‌లో విడుదల చేసిన 32 నిమిషాల్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయని టిటిడి ప్రకటించింది.జనవరి 2 నుంచి 11వతేది వరకు తిరుమల ఆలయం వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, జనవరి 3న వైకుంఠ ద్వాదశి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేక దర్శనానికి సంబంధించి టిటిడి శనివారం ఆన్ లైన్‌లో టికెట్లను జారీ చేసింది. ఉదయం 9 గంటలకు టికెట్లను రిలీజ్ చేయగా.. 32 నిమిషాల్లోనే టికెట్లు అన్నీ బుక్ అయిపోయాయి. మరోవైపు సర్వ దర్శనం కోసం జనవరి 1వ తేదిన ఆఫ్ లైన్ విధానంలో టోకెన్లు కేటాయించనున్నారు. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకి 50 వేల చొప్పున 5 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు టిటిడి తెలిపింది.
Admin
Viswas Tv