విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయవాడ : అమరావతి... ఏపీ లో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ విడుదల తెదేపా అధినేత చంద్రబాబు తిరుమల పర్యటనకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి తిరుమలకు వెళ్లిన ఆయన.. గురువారం రాత్రి అక్కడే బస. శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం అమరావతికి రానున్నారు.డిసెంబర్ 2న విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు దర్శించుకోనున్నారు. డిసెంబర్ 3న సింహాచలం వెళ్లి అప్పన్న స్వామి దర్శనం చేసుకుంటారు.డిసెంబర్ 5న శ్రీశైలం మల్లన్న దర్శనానికి చంద్రబాబు వెళ్తారు.
Admin
Viswas Tv