Wednesday, 19 November 2025 07:12:56 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

వైస్సార్సీపీ లో కలవరం -- సీఎం జగన్ బేలతనo

మంత్రులు బయట కోవర్టులుగా మారారు

Date : 04 November 2023 02:31 PM Views : 2973

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విజయనగరం జిల్లా : నన్ను సీఎంను చేయాలని లేదా అంటూ విశాఖ నేతలపై జగన్ రెడ్డి అలిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాను చెప్పిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పని చేయడం లేదని.. తనను సీఎంను చేయాలని మీకు లేదని … విమానాశ్రయంలో తనకు బోకేలు ఇచ్చేందుకు వచ్చిన వారిపై ఆయన విరుచుపడినంత చేయడం… దాన్ని వైసీపీ వాళ్లే రికార్డు చేసి… ఇంత బేలగా ఉన్నాడేంటి అనుకుని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగిపోయాయి. జగన్ రెడ్డి ఎప్పుడూ తన సీఎం సీటు గురించే ఆలోచిస్తారు. అందులో సందేహం లేదు. కానీ… ఇక్కడ విషయం ఏమిటంటే.. . తనను తాను సీఎంను చేసుకున్నానని అనుకునేవారు ఇప్పుడు… తనను ఇతరులు సీఎం చేయాలని అనుకుంటున్నారు. జగన్ రెడ్డి తన పార్టీపై… మంత్రులపై పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోయారు. కేబినెట్ భేటీ తర్వాత ఆయన మంత్రులతో చిట్ చాట్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. అక్కడ మాట్లాడినవన్నీ మీడియాకు తెలుస్తున్నాయని అందుకే మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేశారు. ఓ ముఖ్యమంత్రి తన కేబినెట్ పై పూర్తి స్థాయిలో నమ్మకం కోల్పోవడం అనేది… జస్ట్ జగన్ రెడ్డి ధింగ్స్ అని వైసీపీలోనే చర్చ ప్రారంభమయింది. అందరూ కోవర్టులేనని వైసీపీ పరిస్థితి బాగోలేదని.. సేఫ్ గా అందరూ టీడీపీ, ఆ పార్టీ సన్నిహితులతో టచ్ లోకి వెళ్లారని జగన్ రెడ్డి గట్టి నమ్మకంతో ఉన్నారు. జగన్ రెడ్డి బేలతనం

151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డిలో ఇంత ఘోరమైన పతనం చూస్తామని వైసీపీ నేతలూ అనుకోలేకపోతున్నారు పాలన వైఫల్యాలను పక్కన పెట్టినా.. సొంత పార్టీ విషయంలో … పార్టీ నేతల విషయంలో ఆయన నమ్మకం కోల్పోవడం అంటే… ఇక ఇప్పుడల్లా కోలుకునే పరిస్థితి ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారి కంటే పార్టీలో ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తానని చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధన్యం ఇస్తానని చెబుతున్నారు. కానీ ఇంతకు ముందు మొహమాటాలేమీ లేవని.. ఎవరు గెలుపు గుర్రం అయితే వారికే టిక్కెట్లు ఇస్తానని చెప్పుకొచ్చేవారు. మొత్తంగా జగన్ రెడ్డిలో కనిపిస్తున్న స్పష్టమైన బేలతనంతో… ఆయన అధికారాన్ని చూసి ఎగిరెగిరిపడిన వారికి గుండెలు జారిపోతున్నాయి. తాము చేసిన నిర్వాకాలతో అధికారం కోల్పోయిన తర్వాత ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవడo కష్టమని కంగారు పడుతున్నారు

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :