Thursday, 30 July 2026 07:38:45 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

వైఎస్ భారతి,జగన్మోహన్ రెడ్డి తో రాత్రి 3 గంటలకు, అవినాష్ రెడ్డి ఏమి మాట్లాడారో బయట పెట్ట వలిసిందే !!!

వైఎస్ వివేకా హత్యా కేసులో నిజాలు బయట పెట్టాలి అని డిమాండ్ చేసిన టీడీపీ నేత చిన రాజప్ప..

Date : 12 February 2023 03:40 PM Views : 1009

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / కృష్ణా జిల్లా : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణి వైఎస్ భారతికి సంబంధం లేకపోతే వారి కాల్‌డేటా బయటపెట్టాలని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు. దీనికోసం సీబీఐని కోరాలన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు.. అర్ధరాత్రి 3.00 గంటల సమయంలో కడప వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతికి ఫోన్ చేసి ఏం మాట్లాడారో చెప్పాలని ప్రశ్నించారు. వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల ఆధ్వర్యంలో వివేకా హత్య కేసులో సాక్షాధారాలు ధ్వంసం చేశారన్నారు. ఇది వాస్తవం కాదా? అని చినరాజప్ప నిలదీశారు. సాక్షాధారాలు ధ్వంసం చేయడం ద్వారానే వివేకా హత్యలో వైఎస్ అవినాష్రెడ్డి పాత్ర ఉందని అర్థమవుతోందని, వివేకానందరెడ్డి గొడ్డలిపోటు వల్ల మరణిస్తే.. గుండెపోటు అని వైఎస్ జగన్ సొంత ఛానల్‌లో ఎందుకు వేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు

శివశంకర్రెడ్డిని వైసీపీ నుంచి బహిష్కరించలేదని, సీఎం జగన్ అండ లేకుండా సీబీఐ అధికారులపై అక్రమ కేసులు పెట్టడం సాధ్యమవుతుందా? అని నిలదీశారు. కడప ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య జరిగిందని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు, జగన్ సోదరి వైఎస్ షర్మిల సీబీఐకి చెప్పలేదా? అని చినరాజప్ప ప్రశ్నించారు. వివేకా హత్యకేసుపై టీడీపీ పుస్తకాన్ని విడుదల చేసింది. 'జగనాసుర రక్త చరిత్ర బహిరంగం' పేరుతో ఈ పుస్తకాన్ని ప్రచురించారు.

పాల్గున్న టీడీపీ రాష్ట్ర నాయకులు.. పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పంచుమర్తి అనురాధ, బోండా ఉమామహేశ్వరరావు, నిమ్మల రామానాయుడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో దీన్ని విడుదల చేశారు. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో సీఎం జగన్‌ లక్ష్యంగా చేసుకొని టీడీపీ నేతలు ఫైరవుతున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: