Wednesday, 19 November 2025 07:12:56 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

విశాఖపట్నం : కిడ్నీ దందా. తిరుమల ఆస్పత్రి సీజ్ చేసిన అధికారులు....

విశాఖలో జరిగిన కిడ్నీ దందాపై అధికారులు సీరియస్‌ అయ్యారు..

Date : 28 April 2023 06:19 PM Views : 3319

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : విశాఖలో జరిగిన కిడ్నీ దందాపై అధికారులు సీరియస్‌ అయ్యారు. తిరుమల ఆస్పత్రిని సీజ్ చేశారు. కిడ్నీ బాధితుడు వినయ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో ఆస్పత్రిలో జరిగిన ఘటనపై డీఎమ్‌హెచ్‌వో నివేదిక రెడీ చేసింది. ఈ మేరకు హాస్పిటల్‌పై చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రికి అనుమతి లేదని గుర్తించారు. సర్జరీ చేసిన వైద్యుడిని నిర్ధారించే ప్రయత్నాలు చేస్తున్నారు.

కిడ్నీ రాకెట్ దందా గుట్టురట్టు కాగా విశాఖలో మరో కిడ్నీ రాకెట్ బయటపడింది. కిడ్నీ అమ్మకం వ్యవహారంలో మీడియేటర్ కీలకంగా వ్యవహరించగా, ఎముకుల డాక్టర్ కిడ్నీని తొలగించడం వెనుక మూలాల్ని పోలీసులు శోధించే పనిలో పడ్డారు. కామరాజు అనే వ్యక్తి ఒక పేషెంట్‌కు కిడ్నీ అత్యవసరమని చెప్తూ డబ్బులు ఆశ చూపెట్టేవారు. వాంబే కాలనీకి చెందిన వినయ్ కుమార్ ఒక దశలో పరిచయం అయ్యారు. కిడ్నీ కొనుగోలు చేసే వ్యవహారాన్ని చెప్పడంతో అప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండడంతో తన కిడ్నీ అమ్మేందుకు ఒప్పించారు. రూ.8.5లక్షలకు ఒప్పందం కుదరగా, అడ్వాన్స్‌గా రూ.2.5 లక్షలు అందచేశారు. ఆపరేషన్ పూర్తి అయ్యింది.. తన శరీరం నుంచి కిడ్నీ వేరు చేశారు. అయితే ఒప్పందం ప్రకారం మిగిలిన నగదు ఇవ్వలేదు.

కిడ్నాప్ చేసి కిడ్నీ ఆపరేషన్ ఇదిలా ఉండగా అడ్వాన్సు తీసుకున్నప్పటికి ఆపరేషన్‌కు ఇంకా సిద్ధపడలేదని, సమయం కావాలని అడిగారు. అయితే వినయ్‌తో కామరాజు మాట్లాడాలని చెప్పి పిలిపించి కిడ్నాప్ చేసి కిడ్నీని వేరు చేశారు. తన పని పూర్తి కాగానే వినయ్‌ను ఇంటివద్దకు చేర్చి చేతులు దులుపుకున్నారు. తనకు చెల్లించాల్సిన మిగతా నగదు విషయమై ఎటువంటి సమాధానం రాకపోయేసరికి వినయ్ పీఎం పాలెం పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు కామరాజు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. బాధితుడు వినయ్ కుమార్ బంధువులు, స్థానికుల ఆందోళన మరోవైపు విశాఖ కిడ్నీ బాధితుడు వినయ్ కుమార్ బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు. మధురవాడ వాంబే కాలనీలో బాధితుడు వినయ్ కుమార్‌తో కలిసి రోడ్డుపై బైఠాయించారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ సమయంలో వినయ్ కుమార్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. దీంతో స్థానికులు అడ్డుకున్నారు. ఎలాంటి న్యాయమైనా ఇక్కడే జరగాలంటూ స్థానికులు పట్టుబట్టారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :