Monday, 14 September 2026 03:24:48 AM
# వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, కుమార్తె తో కలిసి సీఎం చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిక # 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విఆర్ఓ సూర్యనారాయణ # వెలుగులో అవినీతి"" లీలా""లు దోపిడీ దారుడు అండదండలు!! # నేపాల్ విలయ తాండం, పాలకలు నేర్చుకోవలిసిందే!!! # మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయాలి, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు డిమాండ్ # అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ ముమ్మర ఏర్పాట్లు # ప్రాణాన్ని కాపాడవలసిన వైద్యులు--- మూడు రోజుల నుంచి నరకం చూపిస్తూ వైద్యం చేయకుండా 60 వేలకు బేరాలు ఆడిన కంత్రి డాక్టర్లు # 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్

అన్నవాహిక కేన్సర్.. ఎందుకు వస్తుంది. దాన్ని ఎలా గుర్తించొచ్చు చూద్దాము !!!..!

తీసుకున్న ఆహారం మింగలేకపోవడం ఛాతీలో నొప్పి, మంట గొంతు బొంగురుపోవడం బరువు అసాధారణంగా తగ్గిపోవడం రిస్క్ ను సూచించేవి

Date : 11 February 2023 01:16 PM Views : 1122

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : గొంతు నుంచి జీర్ణాశయాన్ని కలిపే ట్యూబ్ ని అన్నవాహిక అంటారు. తిన్న ఆహారం, తాగిన పానీయాలను ఈ ట్యూబ్ జీర్ణాశయానికి చేరుస్తుంది. నేటి ఆహార అలవాట్లతో అన్నవాహిక కేన్సర్ రిస్క్ కూడా పెరుగుతోంది. అన్న వాహిక కేన్సర్ కు కారణాలు చూసినప్పుడు..కారణాలు గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిసీజ్ (జీఈఆర్డీ) ముఖ్యమైనది. అలాగే, పొగతాగడం, అధిక బరువు, మద్యపానం అలవాట్లు ప్రధానంగా అన్న వాహిక కేన్సర్ కారణాలుగా ఉంటున్నాయి. అలాగే, రసాయనాల ప్రభావానికి లోను కావడం, కుటుంబంలో కేన్సర్ రిస్క్, వేడి పానీయాలను తీసుకోవడం, తగినన్ని పండ్లు, కూరగాయలు తీసుకోని వారికి కేన్సర్ రిస్క్ ఉంటుంది. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

లక్షణాలు అన్నవాహిక కేన్సర్ బారిన పడినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. మింగలేకపోవడం, ఊహించని విధంగా బరువు తగ్గిపోవడం, ఛాతీ భాగంలో నొప్పి, గుండెలో మంట తీవ్రంగా ఉండడం, దగ్గు, గొంతు బొంగురు పోవడం ఇవన్నీ కూడా అన్నవాహిక కేన్సర్ లక్షణాలుగా చూడొచ్చు. ఈ లక్షణాల్లో ఏదో ఒకటి ఉంటే కేన్సర్ అని అనుమానించక్కర్లేదు. ఒకటికి మించిన లక్షణాలు కనిపిస్తాయి. అయితే, వీటిల్లో ఏ లక్షణాలు కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యులను సంప్రదించడం ఎంతో అవసరం. ఎందుకంటే కేన్సర్ అయితే ఆలస్యం చేస్తే కోలుకోవడం కష్టమవుతుంది. చికిత్సలు....... సీటీ స్కాన్, ఈసోఫాజియల్ ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, బయాప్సీ, ఈసోఫాగో గ్యాస్ట్రో ఎండోస్కోపీ ద్వారా కేన్సర్ ను గుర్తిస్తారు. కేన్సర్ ఏ దశలో ఉందన్న దాని ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ, ఎండోస్కోపిక్ లేజర్ థెరపీలను సూచించొచ్చు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :