Wednesday, 19 November 2025 07:06:52 AM
# మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి # తమిళనాట కొత్త పార్టీ, తాట తీస్తా అంటున్న హీరో విజయ్,

ఆరోగ్యం బాలేదని ,క్షుద్రపూజలు..నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా.. బలి

ఆరోగ్యం బాలేదని క్షుద్రపూజలు.. నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా.. ప్రపంచమంతా కంప్యూటర్‌ వేగంతో దుసుకుపోతుంటే ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ

Date : 03 October 2023 10:30 AM Views : 3020

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు జిల్లా : ప్రపంచమంతా కంప్యూటర్‌ వేగంతో దుసుకుపోతుంటే ప్రజలు మాత్రం ఇంకా మూఢనమ్మకాల నుంచి బయటకు రావడం లేదు. గడప వద్దే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నా మూఢనమ్మకాల్లోనే మగ్గిపోతున్నారు. దాంతో.. కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు అమాయకులు. తాజాగా.. మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. చెన్నూరు పట్టణం బొక్కలగుట్ట కాలనీకి చెందిన దాసరి మధు అనే యువకుడికి కొన్ని రోజులుగా హెల్త్‌ ప్రాబ్లమ్స్‌ ఉన్నాయి. అయితే.. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ఏమాత్రం ఉపశమనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మంత్రాలు, తంత్రాల వైపు ఆలోచన చేశారు. మూఢనమ్మకాలను బాగా నమ్మే కొందరు జనం.. మధు ఆరోగ్యంపైనా అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే.. ఆ యువకుడికి ఎవరో ఏదో చేశారని.. మంత్రం వేశారని ఆరోపిస్తూ అతని ప్రాణాల మీదికి తెచ్చారు కుటుంబ సభ్యులు. అంతే సంగతులు.. యువకుడి ఆరోగ్యం విషయంలో వారిలో వారే మూఢనమ్మకాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. అనుమానాన్ని పెంచి పోషించారు. అనారోగ్యంతో ఉన్న అతణ్ని తాంత్రిక పూజల కోసం గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. నగ్నంగా రకరకాల పూజలు చేసిన మాంత్రికుడు.. యువకుడ్ని కూర్చోబెట్టి.. దూపం వేస్తూ తాంత్రిక పూజలు నిర్వహించాడు. దాంతో… అనుకోని పరిస్థితుల్లో పూజలు కొనసాగుతుండగానే ఆ యువకుడు చనిపోవడం కలకలం రేపింది. అయితే.. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్‌ రివర్స్‌ అయింది. అంత్యక్రియలను అడ్డుకొని అక్కడే పోలీసుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు వైద్యులు. యువకుడి మృతి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తాంత్రిక పూజల్లో భాగంగా వేసిన పొగతో ఊపిరాడకపోవడంతోనే యువకుడు చనిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు వైద్యులు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2025. All right Reserved.

Developed By :